వృద్ద మహిళలకు వీల్ ఛైర్స్ బహుకరణ

వితరణ చాటుకొన్న హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

(జానో జాగో వెబ్ న్యూస్-ఒంగోలు  ప్రతినిధి)

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా రీజియన్ ఛైర్మన్ షేక్. ఖలీఫాతుల్లాబాషా అధ్యర్యంలో సమతా మహిళా వేదిక వృద్దుల ఆశ్రమంలో ఉన్న వృద్దుల కోసం వీల్ చైర్ ను ,మరియు రేషన్ కోసం ఐదు వేల రూపాయలు బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానసిక రుగ్మతలకు లోనైన అభాగ్యులకోసం అండగా ఉంటు వారికి కావలసిన సదుపాయాలు అందించడములో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా  ముందుంటుందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అవసరమైన వృద్దుల ఆశ్రమలలో వీల్ చైర్ ఇస్తున్నామన్నారు.కవలసినవారు 9848225407 నెంబర్ కు ఫోన్ చేస్తే వారికి అవకాశము కల్పిస్తామని అన్నారు.


సమాజ సేవ చేయడానికి మిత్రులు తోగంటి శ్రీనివాసరావు,షేక్. ఆదిల్,డాక్టర్. జి.అనూహ్య రెడ్డి లాంటి వారు ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం అందిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీరాష్ట్ర నాయకులు పారిశ్రామికవేత్త శ్రీ.తోగంటి శ్రీనివాసరావు, ప్రముఖ వైద్యులు శ్రీ.చేపల వంశీకృష్ణ, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపి లీగల్ కార్యదర్శి శ్రీ.జాజులా శ్రీనివాసరావు,బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దామోదర్,ఆదిల్ ఇన్నోవేషన్ క్లబ్ డైరెక్టర్ షేక్. అహీత్,సమతా మహిళా వేదిక వృద్దుల ఆశ్రమ నిర్వాహకులు వి. అంకబాబు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: