జోకర్, కమెడియన్ ఎవరన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు


జోకర్, కమెడియన్ ఎవరన్నది తెలంగాణ ప్రజలకు తెలుసని మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఓటు వేయని వాళ్ల ఇండ్లను బుల్డోజర్ లను పంపించి కూల్చేయిస్తామంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను పోస్ట్ చేసిన కేటీఆర్.. మరో కమెడియన్ బయటకొచ్చాడని పేర్కొంటూ ట్వీట్ చేశారు. దీనిపై రాజాసింగ్ మండిపడ్డారు. జోకర్, కమెడియన్ ఎవరన్నది తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. అసెంబ్లీలో మాట ఇచ్చి బయట మరచిపోయే వ్యక్తి ఎవరో, అబద్ధాలు ఎవరు చెబుతారో అందరికీ తెలుసని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ లకు పనీపాటా లేదని, జీరో అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యాకొడుకులు కలిసి బీజేపీపై బురదజల్లుతున్నారని విమర్శించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: