వీరయోధ పాటను పంచుకొన్న కేటీఆర్


కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రూపొందిన వీరయోధ అనే పాటను మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంచుకున్నారు. ఇదిలావుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గులాబీ దళం సంబరాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో, కే కేసీఆర్ జన్మదినం సందర్భంగా రూపొందించిన 'వీర యోధ' పాట ఉద్వేగభరితంగా ఉందని పేర్కొన్నారు. "భారతీయతే మనకు ప్రాణం... అది కేసీఆర్ హృదయనాదం... నీవెంట నిలుస్తాం, నడుస్తాం... గెలుస్తామయా" అంటూ ఈ గీతం సాగుతుంది. 'వీర యోధ' పాటకు సంబంధించిన వీడియోను కూడా కేటీఆర్ పంచుకున్నారు. ఈ పాటకు అభిజ్ఞ రచన, గానం అందించగా... ఎస్కే బాజి సంగీతం అందించారు. కె.లక్ష్మణ్ నిర్మాణంలో పూర్ణ దర్శకత్వం వహించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: