నరేంద్ర మోడీ ప్రధాని పదవికి అనర్హుడు

టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్

(జానో జాగో వెబ్ న్యూస్ -హైదరాబాద్ బ్యూరో)

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవికి అనర్హుడని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ విమర్శించారు. ఇటీవల పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ మాట్లాడారు...పి.ఎమ్ మోడీ నిన్న , మొన్న లోక్ సభ, రాజ్యసభలలో కాంగ్రెస్, తెలంగాణాకు వ్యతిరేకంగా చేసిన ప్రసంగాలు ఆయన నిజస్వరూపాన్ని బయట పెట్టాయి. ఆయన తన మాటలతో ప్రధాని పదవి స్థాయిని దిగజార్చారు. నిలువెత్తు ద్వేషం, అక్కస్సు తో ఉన్న వ్యక్తి మోడి. ఈ దేశానికి ప్రధాన మంత్రి గా ఉండటానికి అనర్హుడు. అతడు ప్రధాన మంత్రిగా కొనసాగితే దేశ విచిన్నానికి దారి తీస్తుంది. మోడీకి కాంగ్రెస్ అంటే ద్వేషం, ఓర్వలేనితనం. ఆయన శరీరమంతా విషమే. సందర్భం అయినా కాకున్నా , ఉద్దేశ్యపూర్వకముగా ద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడము ఆయనకు అలవాటయింది. ఇతరులను నొప్పించి, ఆనందించే పైశాచికత్వము ఆయనది. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ నాయకుల పాత్రను, త్యాగాలను యావత్ ప్రపంచమంతా కొనియాడితే, ఈయన మాత్రం తృణీకరిస్తున్నారు. ఈయన దేశ భక్తుడా? దేశ ద్రోహియా?  ప్రజలాలోచించాల్సిన సమయము ఆసన్నమైంది. మొన్న సోమవారం లోక్ సభలో స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు, ప్రథమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రును చులకన చేస్తూ మాట్లాడిన మోడీ నిన్న రాజ్య సభలో తెలంగాణా ఏర్పాటును- అమర వీరుల బలిదానాలను చులకన చేస్తూ మాట్లాడి తెలంగాణా ప్రజలను అపహాస్యం చేస్తూ మాట్లాడారు. 1998 లో ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ లో తీర్మానం చేసిన బి.జె.పి ఆ తర్వాత వాజ్ పాయ్ ప్రధాన మంత్రిగా కేంద్రము లో అధికారములోకి వచ్చినా  తెలంగాణా ఏర్పాటు చేయని బిజెపి, కాంగ్రెస్ పార్టీ అన్ని అడ్డంకులను ఎదుర్కొని సోనియా గాంధీ నాయకత్వలో ప్రత్యేక రాష్త్రం ఏర్పాటు బిల్లు పాస్ చెస్తే ఎద్దేవా  చేయడాన్ని ప్రజలు సహించరు. తెలంగాణా ప్రజలకు మోడీ క్షమాపణలు చెప్పే వరకు బిజెపి వారిని ప్రజలు తెలంగాణాలో తిరుగనివ్వవద్దు. ఇది తెలంగాణా ప్రజల ఆత్మగౌరవ సమస్య. అని ఆయన పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: