గడివేముల మండలంను నంద్యాల జిల్లాలో కాలపాలి

తహశీల్దార్ నాగమణికి...ఏపిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా,గడివేముల మండలం, పాణ్యం నియోజకవర్గ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు మహాబూబ్ బాషా అధ్వర్యంలో గురువారం నాడు మండల తహశీల్దార్ నాగమణికి  గడివేముల మండలం ను నంద్యాల జిల్లాలో కలపాలి అని వినతి పత్రం అందజేశారు.ఈ సంధర్భంగా ఏపిడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు మహాబూబ్ బాషా మాట్లాడుతూ.....గడివేముల మండలం మొదటి నుంచి నంద్యాల డివిజన్‌లోనే ఉందని అన్నారు.నంద్యాల నుంచి గడివేముల మండలానికి కొన్ని గ్రామాలు 15 కి.మీ, మండల కేంద్రానికి 28 కి.మీ దూరంలో ఉందని అన్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా గడివేములను కర్నూలులో కలపడం వల్ల కర్నూలు గడివేముల మండల కేంద్రానికి 70 కి.మీ, మండలంలోని పలు గ్రామాలకు 80 కి.మీ దూరం ఉంటుందని అన్నారు.


సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తుందన్నారు.గడివేముల, పాణ్యం మండలం లో ఉన్న 70 వేల పైచిలుకు ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని గడివేముల, పాణ్యం మండలాలను నంద్యాల జిల్లాలను కలపాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపిడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు మహా బూబ్ భాషా ట్రేసరర్ రసూల్సాహెబ్,మహా బూబ్ భాష,పంట మోహన్ రెడ్డి,మహమ్మద్ సలేహా,మస్తాన్,యెల్ల సుబ్బయ్య,మహేష్ బాబు,గోదా ప్రసాద్,బేరి పుల్లయ్య,ముజీబ్,చంద్రబాబు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: