'ఆడవాళ్లు మీకు జోహార్లు' ....టీజర్ రిలీజ్


కరోనావేళ కూడా సినిమాలు ఊపందుకొంటున్నాయి. ఇదిలావుంటే ఫ్యామిలీ ఎమోషన్స్ తో అల్లుకున్న కథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు కిశోర్ తిరుమల సిద్ధహస్తుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'నేను శైలజ' .. 'చిత్రలహరి' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సిద్ధమవుతోంది. శర్వానంద్ - రష్మిక జంటగా నటించిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై శర్వానంద్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశలను ఈ సినిమా ఎంతవరకూ నెరవేర్చుతుందో చూడాలి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: