తన చర్యలతో...ప్రజల మనస్సుపై ప్రత్యేక ముద్ర


తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటినుంచి ఏదో ఒక ప్రత్యేకతతో ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రజల మనస్సులో ప్రత్యేక ముద్ర వేసుకొంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తన పంథా చాటుకున్నారు. రోడ్డు పక్కన "సీఎం సర్ ప్లీజ్ హెల్ప్ మీ" అనే ప్లకార్డుతో నిల్చున్న ఓ యువకుడ్ని చూసి తన కాన్వాయ్ ఆపేశారు. ఇవాళ ఉదయం సీఎం స్టాలిన్ తన నివాసం నుంచి అసెంబ్లీకి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన కాన్వాయ్ టీటీకే రోడ్డు వద్దకు వచ్చేసరికి అక్కడ ఓ యువకుడు సాయం చేయాలంటూ ప్లకార్డుతో దర్శనమిచ్చాడు. వెంటనే తన కారు ఆపాలని సిబ్బందికి సూచించిన సీఎం స్టాలిన్, వాహనం దిగి స్వయంగా ఆ యువకుడితో మాట్లాడారు. ఆ యువకుడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఆ యువకుడి పేరు ఎన్. సతీశ్. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందినవాడు. ఇటీవల కొంతకాలంగా నీట్ విషయంలో సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్న పోరాటానికి సతీశ్ కూడా ప్రభావితుడయ్యాడు. సీఎం స్టాలిన్ ను ఈ విషయంలో అభినందించిన సతీశ్... దేశవ్యాప్తంగా నీట్ అభ్యర్థులకు మినహాయింపులు కల్పించేలా కేంద్రాన్ని ఒప్పించాలని సీఎం స్టాలిన్ ను అర్థించాడు. దీనిపై సీఎం స్టాలిన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు సందడి చేస్తున్నాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: