కేసీఆర్ కు ఉద్దవ్ థాక్రే ఫోన్...బీజేపీపై పోరుకు మద్దతు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమత్రి కె.చంద్రశేఖర్ రావుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఫోన్ చేసి సంభాషించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే కేసీఆర్‌కు మాజీ ప్ర‌ధాని దేవేగౌడ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. తాజాగా, మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే కూడా కేసీఆర్‌కు మ‌ద్దతు తెలిపారు. నిన్న కేసీఆర్‌కు ఉద్ధ‌వ్ థాక్రే ఫోన్ చేసిన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ నెల 20వ తేదీన ముంబై రావాల‌ని, అన్ని అంశాల‌పై చ‌ర్చిద్దామ‌ని కేసీఆర్ కు ఉద్ధ‌వ్ థాక్రే చెప్పారు. దీంతో మ‌హారాష్ట్ర సీఎం ఆహ్వానం మేర‌కు 20న కేసీఆర్ ముంబ‌యికి వెళ్ల‌నున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్ దేశంలో ప‌లు ఎన్డీయేత‌ర పార్టీల‌తో చ‌ర్చించారు. ఎన్డీయే, యూపీఏతర కూట‌మి ఏర్పాటుపై కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: