బీజేపీకి ఆయుధంగా మతం, పాకిస్తాన్: తలసాని శ్రీనివాస్ యాదవ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఇటీవల టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలంగాణ భయపడదని, రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన మంత్రి.. బీజేపీపై దుమ్మెత్తి పోశారు. బీజేపీ వాడుకునేందుకు పాకిస్థాన్, మతం చక్కగా దొరికాయని, ఈ రెండింటి పేరు చెప్పి రెచ్చగొట్టడం ఒక్కటే ఆ పార్టీకి తెలుసని అన్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పారిశ్రామికవేత్తల కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపైనే కేంద్రం బతుకుతోందన్నారు. కేంద్రానికి రాష్ట్రం ఏమిచ్చిందో తాము చెబుతామని, మరి రాష్ట్రానికి ఏమిచ్చిందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పగలరా? అని నిలదీశారు. ఈ విషయంలో తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: