వారికి ప్రజల బాధ ఎలా అర్థమవుతుంది: అఖిలేస్ యాదవ్

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, సమాజ్ వాది పార్టీల మధ్య మాటల  తూటాలు పేలుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో సమాజ్‌వాదీ పార్టీ ని "నకిలీ సమాజ్‌వాద్" అని ఆరోపిస్తూ, కుటుంబ పార్టీ అని పేర్కొన్నారు. ఇక దీనిపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గురువారం టార్గెట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు నడుపుతున్నారా చెప్పాలి అంటూ అని మండిపడ్డారు. కుటుంబం లేనివారికి ఇతరుల బాధ అర్థం కాదని చురకలంటించారు. 2017 ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. కుటుంబం ఉన్నవారే కుటుంబం పడే బాధను అర్థం చేసుకోగలరని, కుటుంబం లేని వారికి అర్థం కాదని చెప్పాలనుకుంటున్నాను అంటూ ఎదురు దాడి చేశారు అఖిలేష్ యాదవ్ .ఐదేళ్లుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన బీజేపీ తమ చివరి మేనిఫెస్టో కోసం రెండు నిమిషాలు మౌనం పాటించాలని అన్నారు. తాము కుటుంబాలు కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నాము, కుటుంబ వ్యక్తి జోలా (బ్యాగ్) తో పారిపోడని, కుటుంబాన్ని విడిచిపెట్టడు అని పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో, ముఖ్యమంత్రికి కుటుంబం ఉంటే, కూలీలు మైళ్ల దూరం నడిచిన బాధను అర్థం చేసుకునే వారన్నారు. అఖిలేష్ యాదవ్ ఫకీర్లు ఏదో ఒక రోజు చంకన జోలె తగిలించుకుని వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. "డబుల్ ఇంజిన్" నినాదంపై బిజెపిపై విరుచుకుపడిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ , గురువారం ప్రారంభమైన కీలకమైన ఎన్నికలు రాజ్యాంగాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అని అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: