విద్యా సంస్థల్లో హిజాబ్ రాజకీయాలను ఆపండి

ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్బాస్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కర్ణాటక ప్రభుత్వం విద్యా సంస్థల్లో హిజాబ్ రాజకీయాలకు స్వస్తి పలకాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. రెండు నెలల్లో పరీక్షలు ఉన్న నేపథ్యంలో వారి చదువులు దెబ్బతింటున్నాయన్నారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఆవాజ్‌ మహిళా సమావేశంలో ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ అబ్బాస్‌ ప్రసంగించారు. ఆవాజ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రఫత్ అంజుమ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  మాట్లాడుతూ హిజాబ్ అనేది పెద్ద విషయం కాదని, అయితే విద్యా సంస్థలలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడం చాలా పెద్ద విషయమని అబ్బాస్ అన్నారు.


ఇది మన జాతీయ సమగ్రతకు చాలా హానికరమని, రాజకీయ ప్రయోజనాల కోసం నిప్పుతో చెలగాటం ఆడుకోవద్దని హితవు పలికారు. విద్యార్థులకు మంచి విద్యపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛ ప్రకారం తమ మత సంప్రదాయాలు, దుస్తులు,ఆహారపుటలవాట్లను స్వేచ్ఛగా అనుసరించే హక్కు ప్రజలకు ఉందన్నారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు పిలుపునిచ్చారు. 
మతతత్వానికి అదొక్కటే పరిష్కారమని అన్నారు. ఈ సమావేశంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహ్మద్ ఖాన్, ఆవాజ్ మహిళా నాయకులు మొయిన్ బానో, షేక్ రిజ్వానా, సయ్యదా తన్వీర్ అలియా తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: