ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలు...

 దళిత లకు ముస్లిం లకు ఇవ్వాలి

గిరిజన సమైక్య సంఘం...జానో జాగో సంఘం డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల ప్రతినిధి)

ఖాళీ అవుతున్న రాజ్యసభ అ సీట్లలో దళితులు ముస్లింలకు చోటు కల్పించాలని గిరిజన సమాఖ్య సంఘం,..జానో జాగో సంఘం డిమాండ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన సమైక్య సంఘం కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో దళిత గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు సోమవారపు మధు బాబు, జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా వారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ నుంచి త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి వాటిలో రెండు స్థానాలు ఒకటి దళితులకు ఒకటి ముస్లింలకు కేటాయించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 

మాట్లాడుతున్న జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ముస్లింలకు అవకాశం ఇవ్వాలని వారు కోరారు. వారి యొక్క క్యాబినెట్ లో సముచిత స్థానం ఇచ్చారని అలాగే దళితుల ముస్లింల కు రాజ్యసభలో కూడా స్థానమిచ్చి దళిత ముస్లింల పక్షపాతి అని నిరూపించుకోవాలని అలాగే సమస్యలపై పోరాటాలు చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ దళిత గిరిజనుల ముస్లింల సమస్యలపై రాజ్యసభలో వారి హక్కులపై రాజ్యసభలో వినిపించడానికి దళిత గిరిజన ముస్లిం సభ్యులు రాష్ట్ర నుంచి కావాలని వారు అన్నారు ఈ సమావేశంలో అవే దళిత గిరిజన సమాఖ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంగి ఎల్లయ్య షేక్ రఫీ పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: