క్లెయిమ్ కాకుండా రూ.21,539 కోట్ల భారీ మొత్తం... ఎల్ఐసీ వద్ద ములుగుతోంది


ఎల్ఐసీ పాలసీలు మనం ఎంత ఉత్సాహంగా తీసుకొంటామో అనివార్య కారణాల వల్ల గానీ ఇతర కారణాలు క్లెయిమ్ చేసుకోకుండా ఉండేవారూ ఉంటారు. ఇలా క్లెయిమ్ కాకుండా పాలసీదారులకు సంబంధించి రూ.21,539 కోట్ల భారీ మొత్తం ఎల్ఐసీ వద్ద 2021 సెప్టెంబర్ నాటికి మూలుగుతోంది. పాలసీదారుల నుంచి క్లెయిమ్ రాని మొత్తాన్ని ఎల్ఐసీ ప్రత్యేక నిధిగా కొనసాగిస్తుంటుంది. పదేళ్ల వరకు క్లెయిమ్ రాకపోతే ఆ మొత్తాన్ని ఎల్ఐసీ తనవద్ద ఉంచుకోకూడదు. వృద్ధుల సంక్షేమ నిధికి బదలాయించాలి. కనుక పాలసీదారులు తమకు సంబంధించిన ఏదైనా పాలసీ గడువు తీరి, క్లెయిమ్ చేయనట్టయితే వెంటనే ఆ పని చేయడం మంచిది. మరణించిన వారికి సంబంధించి పాలసీలు ఉంటే పరిహారం కోసం క్లెయిమ్ రాకపోవచ్చు. పాలసీ గడువు తీరినప్పటికీ ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోకపోవచ్చు. ప్రీమియం రిఫండ్ లు ఇలాంటివన్నీ క్లెయిమ్ చేయని నిధి కిందకే వస్తాయి. పాలసీదారులు తమకు సంబంధించిన పాలసీ నంబర్ ఆధారంగా ఎల్ఐసీ పోర్టల్ పై పరిశీంచుకోవచ్చు. https://customer.onlinelic.in/LICEPS/portlets/visitor/unclaimedPolicyDues/UnclaimedPolicyDuesController.jpf పోర్టల్ కు వెళ్లాలి. అక్కడ పాలసీ నంబర్, పాలసీదారు పేరు, వారి డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇచ్చి సబ్ మిట్ బటన్ క్లిక్ చేయాలి. పాన్ నంబర్ కాలమ్ ఉంది. ఒకవేళ పాన్ ఉంటే ఆ వివరాలు ఇస్తే చాలు. లేకపోయినా పర్వాలేదు. సబ్ మిట్ చేసిన తర్వాత తమకు సంబంధించిన అన్ క్లెయిమ్డ్ వివరాలు కనిపిస్తాయి. అనంతరం కేవైసీ పత్రాలు, పాలసీ డాక్యుమెంట్ (ఒకవేళ కనిపించకపోతే ఎల్ఐసీకి ప్రత్యేక దరఖాస్తు ఇవ్వాలి) సమర్పించడం ద్వారా క్లెయిమ్ కు దరఖాస్తు చేసుకోవాలి. పరిశీలన అనంతరం పాలసీదారు బ్యాంకు ఖాతాకు నిధి బదిలీ అవుతుంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: