ఈ నెల 21వ తేదీన భీమ్లా నాయక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్


ఈ నెల 25వ తేదీన భీమ్లా  నాయక్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంంది. మొత్తానికి 'భీమ్లా నాయక్' సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయడమనేది ఖాయమైపోయింది. దాంతో మళ్లీ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తమన్ స్వరపరిచిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ జనంలోకి దూసుకుపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ .. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. చీఫ్ గెస్టు లేకుండానే కార్యక్రమాన్ని కానిచ్చేసే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను అందించారు. టైటిల్ సాంగ్ రాసింది కూడా ఆయనే కావడం విశేషం. మరో ప్రధానమైన పాత్రలో రానా నటించగా, కథానాయికలుగా నిత్యా మీనన్ .. సంయుక్త మీనన్ అలరించనున్నారు. ఈ మలయాళ కథ తెలుగులోను సంచలనాన్ని సృష్టిస్తుందేమో చూడాలి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: