జూన్ 10న థియేటర్లలో...

విడుదల కానున్న జూరాసిక్ వర్డ్: డొమినియన్

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ బ్యూరో)

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూరాసిన్ వల్డ్: డొమినియన్ ట్రైలర్ విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది యూనివర్సల్ పిక్చర్స్. జూరాసిక్ వల్డ్లో మూడో భాగం, మొత్తం జూరాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో ఆరో చిత్రమైన డొమినియ్ జూన్ 10, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

జూరాసిక్ వల్డ్ రూపకర్త, దర్శకుడు కొలిన్ ట్రెవోరో రూపొందించిన డొమినియన్ కథ ఇస్లా నూబ్లర్ నాశమైన నాలుగు సంవత్సరాల తర్వాత నుంచి మొదలవుతుంది. గత చిత్రంలో నిర్బంధం నుంచి బయట పడిన డైనోసర్లు ఇప్పుడు బతికేందుకు, వేటాడేందుకు మానవులతో కలిసి ప్రపంచమంతా ఉంటాయి. చరిత్రలోనే అత్యంత భయంకరమైన జీవులతో కలిసి జీవిస్తున్న మానవులు అత్యున్నతంగా ఉంటారా? ఆ సమతుల్యత భవిష్యత్ను పునర్నిర్మించి నిర్థారిస్తుంది.


జూరాసిక్ వల్డ్ చిత్రాల సారం మొత్తాన్ని నిక్షిప్తం చేసుకున్న ఈ శక్తిమంతమైన ట్రైలర్ నిజంగా సాహాసోపేతంగా ఉంటూ థ్రిల్లింగ్ కలిగిస్తుంది. మొదటి దృశ్యం నుంచే మీరు నోరు వెళ్లబెట్టుకునేలా చేసే ఈ ట్రైలర్లో జూరాసిక్ శకంలోని డైనోసర్లు మరింత భారీగా, మరింత భయంకరంగా కనిపిస్తాయి. జూరాసిక్ ఫ్రాంచైజీని అభిమానించే వారిని అలాన్ గ్రాంట్, ఎల్లీ సాట్లర్ మధ్య జరిగే సన్నివేశం పాత దృశ్యాలను గుర్తుకు తెస్తుంది. ట్రైలర్లో చూపిన మనుషులు, డైనోసర్ల మధ్య చోటుచేసుకునే వరుస ఛేజ్ దృశ్యాలు ప్రతీ ఒక్కరిని మునివేళ్లపై నిలబెడతాయి. సినిమా విడుదల కోసం ఆత్రంగా ఎదురు చూసేలా చేస్తాయి.

క్రిస్ ప్ర్యాట్, బ్రైసీ డలాస్ హోవార్డ్ నటించిన డొమినియన్ చిత్రం భూమి మీదకు మళ్లీ డైనోసర్లను తీసుకువస్తుంది. కొత్త శకం జూరాసిక్ పార్క్ చిత్రాలు ఇది శ్రీకారం చుట్టబోతోంది. డొమినియన్ చిత్రం ద్వారా సామ్ నీల్- డాక్టర్ అలన్ గ్రాంట్గా, డాక్టర్ ఎల్లీ శాట్లర్గా లౌరా డెర్న్, డాక్టర్ ఇయాన్ మాల్కామ్గా జెఫ్ గోల్డ్బ్లమ్ తిరిగి తెరపైకి వస్తున్నారు. ఇంగ్లిష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో జూన్ 10న జూరాసిక్ వల్డ్ డొమినియన్ విడుదలవుతుంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: