ప్రపంచం ముందు రష్యా ఒంటరి అవుతోందా...తాజాగా ఈయూ ఆంక్షలు
ఉక్రెయిన్ పై యుద్దం నేపథ్యంలో ప్రపంచం ముందు రష్యా ఒంటరి అవుతోందా...అంటే అవుననే చెప్పవవచ్చు. తాజాగా రష్యాపై ఈయూ కూడా ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌పై యుద్దానికి తెర తీసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ పౌరులు, ఇతర దేశాల పౌరులే కాకుండా స్వయంగా రష్యన్ పౌరులు కూడా నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఉక్రెయిన్‌పైకి దండెత్తి వచ్చిన పుతిన్‌ను నిలువరించేందుకు పలు దేశాలు, దేశాల కూటములు రంగంలోకి దిగినట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటికే నాటో కూడమి రష్యాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయగా..అంతకుముందే చాలా దేశాలు రష్యాపై ఆంక్షలను విధించాయి. తాజాగా అమెరికా కూడా రష్యాపై సైబర్ దాడులకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూడా రష్యాపై ఆంక్షలను విధించేందుకు సిద్ధమైపోయింది. రష్యా వైఖరికి కారణంగా నిలుస్తున్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పైనే ఆంక్షలు విధించేలా ఈయూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు శుక్రవారం పుతిన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ శుక్రవారం ఈయూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపకపోతే పుతిన్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తామంటూ సదరు ప్రకటనలో ఈయూ గట్టి వార్నింగే ఇచ్చింది.
బీజేపీ మతోన్మాద విధానాలను ఓడించి దేశాన్ని రక్షించాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి అబ్బాస్
(జానో జాగో వెబ్ న్యూస్-సిరిసిల్ల ప్రతినిధి)
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తనకు పార్లమెంట్ లోఉన్న మందబలం, అహంభావంతో కలిసిమెలిసి ఉన్న ప్రజలని తమ మతోన్మాద విద్వేషాలతో రెచ్చగొడుతూ మారణహోమం సృష్టించుతుందని,బీజేపీ విధానాలని ఓడించి దేశాన్ని రక్షించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి అబ్బాస్ అన్నారు. శుక్రవారం కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామములో సీపీఎం జిల్లా స్థాయి నాయకత్వ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. క్లాసుల ప్రారంభ సూచకంగా సీపీఎం జెండాను సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ ఆవిష్కరించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఎం డి అబ్బాస్ క్లాసులను ప్రారంభిస్తూ ప్రసంగించారు.ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం పై ప్రమాణం చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ యూపీ సీఎం ఎన్నికల ప్రసంగాలు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పారు.యూపీ లో జరుగుచున్న ఎన్నికల్లో తమకు ఓట్లెయ్యకపోతే ప్రజలను బుల్డోజర్లతో తొక్కిస్తామని చెప్పడం పేదలను భయభ్రాంతులకు గురిచేయడమేనని చెప్పారు. మేము 80 మీరు 20 అని చెప్పడం అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడడం కాదా అని ప్రశ్నిoచారు. లౌకిక ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగ లక్ష్యాలను తుంగలో తొక్కుతుందని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతుoదన్నారు.రైతు వ్యతిరేక చట్టాలు కార్మిక చట్టాల రద్దు, దళిత గిరిజనులు మహిళలపై ప్రతీ రోజు హింస జరుగుతుందన్నారు. ఈ విధానాలను ఓడించకుండా దేశ రక్షణ సాధ్యం కాదన్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు ఆహార సబ్సీడీలు, ఎరువుల సబ్సిడీలకు కొత పెట్టిందన్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ప్రతి ఏటా నిధులు తగ్గించి పేదల ఉపాధి దెబ్బతీసిందన్నారు.రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలులోసీఎం ఘోరంగా విఫలమయ్యాడని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ బలపడితేనె పేదలకు మేలు జరుగుతుందని చెప్పారు. కమ్యూనిస్టులను ఆదరిస్తే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు.సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ మతం మతోన్మాదం అనే అంశం పై క్లాసు బోధించారు. దోపిడీ దోపిడీ పద్ధతులు అనే అంశం పై క్లాసు బోధించారు. సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యులు టి స్కైలాబ్ బాబు ప్రసంగించారు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ జవ్వాజి విమల గన్నేరం నర్సయ్య, అన్నల్ దాస్ గణేష్, శ్రీరాం సదానందం మళ్లారపు ప్రశాంత్, గురిజల శ్రీధర్,లతో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
2
చర్చలకు సిద్దమే కానీ..కండిషన్ అప్లయ్: రష్యా ప్రకటన
యుద్దం చేస్తూనే రుష్యా చర్చల ప్రస్తావన తీసుకొస్తోంది. తాజాగా ఉక్రెయిన్‌పైకి దండెత్తి వచ్చిన రష్యా రెండో రోజుకే రాజీ మంతనాలు మొదలెట్టేసింది. గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్‌పైకి బాంబులతో విచుకుపడ్డ రష్యా.. రెండో రోజు అయిన శుక్రవారమే చర్చలకు తాము సిద్ధమంటూ చెప్పడం మొదలుపెట్టింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఓ కీలక ప్రకటన చేశారు. తాజాగా నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయమే శుక్రవారం మరో కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఉక్రెయిన్‌తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నట్లుగా రష్యా అధ్యక్ష భవనం ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడాల్సి ఉంటుందని కండీషన్ పెట్టింది. ఈ కండీషన్‌కు ఓకే అయితే ఉక్రెయిన్‌తో చర్చలకు తమ బృందాన్ని మిన్‌స్క్‌కు పంపుతామని కూడా పుతిన్ కార్యాలయం వెల్లడించింది. మధ్యాహ్నం విడుదలైన రష్యా విదేశాంగ శాఖ మంత్రి ప్రకటనకు ఉక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అదే మాదిరిగా ఇప్పుడు రష్యా అధ్యక్ష భవనం ప్రకటనకు కూడా ఉక్రెయిన్ నుంచి స్పందనవచ్చే అవకాశమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పుతిన్ వైఖరికి వ్యతిరేకంగా స్వదేశంలోనే నిరసనలు
రష్యా దేశాధినేతపై ఆదేశంలోని పౌరులే నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలెట్టిన రష్యాకు ఇంటా బయటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ అంటూ ఏకంగా యుద్ధాన్నే మొదలెట్టేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వైఖరికి నిరసనగా రష్యాలో గురువారమే పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం వద్ద కూడా నిరసన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ మొదలెట్టగానే..ఆ దేశానికి చెందిన అన్నిదేశాల్లోని రాయబార కార్యాలయాల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే శుక్రవారం సాయంత్రం ఓ యువ జంట ఆ భద్రతా వలయాన్ని దాటుకుని ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం వద్దకు ఉక్రెయిన్ జెండా పట్టుకుని ప్రత్యక్షమయ్యారు. దీంతో షాక్ తిన్న పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
మైనారిటీ సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయించాలి
ఆవాజ్ కమిటీ ఆధ‌్వర్యంలో ధర్నా
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ..ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనారిటీలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ఉన్నారని, వారిని ఆదుకోవడానికి బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని అన్నారు. 5వేల కోట్ల రూపాయలు కేటాయించి మైనారిటీ బంధు పథకం ప్రకటించి పేద మైనారిటీలకు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి 10లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ సత్తార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్,నాయకులు ఇబ్రహీం, బాబా, అక్బర్, అహ్మద్ , జలాలు, అబ్దుల్ రెహమాన్, సలీమ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.
స్టార్ హీరోలు విలన్ గా ఆరగేట్రం
ఒకపుడు హీరోగా చేసిన వారిలో విలన్ గా చేయమంటే ససేమిరా అనే వారు. కాలం మారింది హీరో పాత్రలకంటే పేరు తెచ్చే పాత్రలకే మొగ్గు చూపుతున్నారు. తెలుగు సినిమాల్లో గతంలో విలన్ పాత్రలు చేయాలంటే ముంబై ఆర్టిస్టులను ఎక్కువగా పిలిపించేవారు. అలా పవర్ఫుల్ ప్రతినాయకుల జాబితాను తీసుకుంటే, ముంబై విలన్లు చాలామందే కనిపిస్తారు. కానీ ఇటీవల కాలంలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సీనియర్ హీరోలంతా ఇప్పుడు విలన్ పాత్రలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. తమిళంలో సీనియర్ హీరోలుగా చెలామణి అవుతున్న చాలామంది ఇక్కడ పవర్ఫుల్ విలన్స్ గా జెండా ఎగరేస్తున్నారు. విలన్ పాత్రలకి కూడా వారు అందుకునే పారితోషికం భారీగానే ఉంటోంది. ఆ జాబితాలో అరవింద్ స్వామి .. అర్జున్ .. విజయ్ సేతుపతి తదితరులు కనిపిస్తున్నారు. తాజాగా మహేశ్ సినిమా కోసం హీరో విక్రమ్ పేరు వినిపిస్తోంది. ఇక టాలీవుడ్ లో కూడా హీరోగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న జగపతిబాబు, ఇప్పుడు స్టార్ విలన్ గా వెలుగొందుతున్నాడు. హీరో శ్రీకాంత్ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నాడు. విలన్ గా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక రాజశేఖర్ కూడా సరైన విలన్ రోల్ కోసం చాలా కాలంగానే ఎదురుచూస్తున్నాడు.
సోమువీర్రాజుకు స్వాగతం పలికిన షేక్.ఖలీఫాతుల్లా
(జానో జాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)
ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజుకు ఆ పార్టీ మైనార్టీ మోర్చా మాజీ అధ్యక్షులు,హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా రీజియన్ ఛైర్మన్ షేక్. ఖలీఫాతుల్లాబాషా స్వాగతం పలికారు. ఒంగోలు లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి సోమువీర్రాజు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఖలీఫాతుల్లా బాషా స్వాగతం పలికారు.
కీవ్ ను చుట్టుముట్టిన రష్యా దళాలు
ఉక్రెయిన్ పై యుద్దానికి దిగిన రష్యా ఆ దేశ రాజధాని కీవ్ ను టార్గెట్ చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై పట్టు సాధించడమే లక్ష్యంగా రష్యా ముందుకు కదులుతోంది. కీవ్ లోని అధ్యక్ష భవనంపై గురిపెట్టిన రష్యా స్పెషల్ గెరిల్లా ఫోర్స్ ను రంగంలోకి దించింది. ఇప్పటికే రష్యా సైనిక దళాలు కీవ్ ను చుట్టుముట్టాయి. మరికొన్ని గంటల్లో ఉక్రెయిన్ అధ్యక్ష భవనం రష్యా దళాల పరం అయ్యే అవకాశాలున్నాయని ఉక్రెయిన్ సైనికాధికారులు భావిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోద్మిర్ జెలెన్ స్కీ ఇప్పటికే అధ్యక్ష భవనాన్ని వీడి సురక్షితమైన బంకర్లో తలదాచుకోవడం తెలిసిందే. ఇదిలావుంటే ఉత్తర, ఈశాన్య దిక్కు నుంచి రష్యా దళాలు భారీగా దూసుకొస్తున్నాయని ఉక్రెయిన్ సైన్యం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కీవ్ ను సమీపించే క్రమంలో చెర్నగివ్ నగరాన్ని చుట్టుముట్టిన రష్యా దళాలను తమ సైనికులు తిప్పికొట్టారని ప్రకటించింది. అయితే, రష్యా అధీనంలో ఉన్న కోనోటాప్ నగరం వైపు నుంచి రష్యా దళాలు కీవ్ దిశగా కదులుతున్నాయని తెలిపింది. రష్యాకు తలొగ్గరాదని ఉక్రెయిన్ కృతనిశ్చయంతో ఉంది. అందుకే సాధారణ పౌరులను సైతం దేశరక్షణ దిశగా ఆయుధాలు అందుకోవాలంటూ ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో 18 నుంచి 60 ఏళ్ల వారు దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. రష్యన్ సైన్యంతో పోరాడేందుకు ఇప్పటికే ఉక్రెయిన్ 18 వేల మందికి ఆయుధాలు ఇచ్చింది.
భోగాపురం ఎయిర్ పోర్టుకు క్లియరెన్స్ ఇవ్వండి
భోగాపురం ఎయిర్ పోర్టుకు క్లియరెన్స్ ఇవ్వాలని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖలకు లేఖలు రాశారు. భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామిని గుర్తించిందని, త్వరితగతిన సైట్ క్లియరెన్స్ అనుమతి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పౌరవిమానయాన శాఖ జారీ చేసిన అనుమతి ముగిసిందని, దాన్ని పునరుద్ధరించాలని తెలిపారు. ఎన్ఓసీ లేకపోవడంతో పనులు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. భోగాపురం ఎయిర్ పోర్టును త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని సీఎం జగన్ తన లేఖలో కోరారు. అనుమతులు వేగంగా మంజూరు చేసేలా ప్రధాని నరేంద్ర మోదీ పౌర విమానయాన మంత్రిత్వ శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
బహుభాషా భారీ బడ్జెట్ చిత్రం
సేవాదాస్ సెన్సార్ పూర్తి
(జానో జాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)
శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్-ఎమ్.బాలు చౌహాన్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం "సేవాదాస్". సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్-ప్రీతి అస్రాని, వినోద్ రైనా-రేఖా నిరోష హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు... చిత్ర నిర్మాతలపై ప్రశంసల వర్షం కురిపించారు. బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే "సేవాదాస్" చిత్రాన్ని బంజారా భాషలోనే కాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందరికీ చేరువ చేస్తుండడం అభినందనీయమన్నారు.
కార్యనిర్వాహక నిర్మాత ఎమ్.బాలు చౌహాన్ మాట్లాడుతూ..."64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా రూపొందిన సేవాదాస్" చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోవడం ఓ బంజారా బిడ్డగా గర్వాన్నిస్తోందని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..."సేవాదాస్" రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. వీలయినంత త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ఎస్.ఆర్.ఎస్.ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, అసోసియేట్ డైరెక్టర్స్: రాజేంద్రప్రసాద్ చిరుత-రవితేజ-సంజయ్ భూషణ్-సాయి కుమార్, కో-డైరెక్టర్స్; ఎన్టీఆర్ సుబ్బు-నవీన్, వి ఎఫ్ ఎక్స్: కిషోర్ కాలకూరి, ఆర్ట్ డైరెక్టర్: విజయ్.ఎ, ప్రొడక్షన్ కంట్రోలర్: లక్ష్మణరావు-శ్రీరాములు, కెమెరామెన్: విజయ్ టాగోర్, ఎడిటర్: ప్రదీప్, పోస్ట్ ప్రొడక్షన్: రామానాయుడు స్టూడియోస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్.బాలు చౌహాన్, నిర్మాతలు: ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్; కె.పి.ఎన్. చౌహాన్!!
మళ్లీ ద్విపాత్రలో...బాలకృష్ణ
గతంలో పలు చిత్రాలలో ద్విపాత్ర పోషించిన హీరో బాలకృష్ణ తాజాగా మరో సినిమాలో ద్విపాత్రభినయం చేసేందుకు సిద్దమవుతున్నారు. బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను మొదలుపెట్టేశాడు. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. మైత్రీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా రీసెంట్ గా 'సిరిసిల్ల' జిల్లాలో మొదటి షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టింది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ అనే విషయం ఇంతకుముందే బయటికి వచ్చింది. అక్కడి నీటి సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుందనేది తాజా సమాచారం. ఈ సినిమాలో బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారని అంటున్నారు. ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా అలరించనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది. కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. ప్రతినాయకుడిగా దునియా విజయ్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమా కోసం 'వీరసింహా రెడ్డి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
బాలకృష్ణ సీఎం జగన్ ను కలుస్తానన్నారు: మంత్రి పేర్ని నాని
ఏపీ మంత్రి పేర్నినాని హీరో బాలకృష్ణ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయక్ విడుదల పుణ్యమా అని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాను కలిసే ప్రసక్తే లేదని టాలీవుడ్ అగ్ర హీరో, టీడీపీ కీలక నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారని గతంలో ఓ వార్త చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్త అసత్యమని.. జగన్‌ను కలుస్తానని స్వయంగా బాలకృష్ణే తనతో చెప్పారని ఇప్పుడు ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా బాలకృష్ణ అబద్ధం ఆడతారని తాను అనుకోవడం లేదంటూ నాని ఆసక్తికర కామెంట్ చేశారు. భీమ్లా నాయక్ చిత్రాన్ని ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని జరుగుతున్న ప్రచారంపై మాట్లాడేందుకు శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన నాని.. బాలకృష్ణ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. "హైదరాబాద్ లో ఉన్న బిల్డర్ నారాయణ ప్రసాద్ ద్వారా, నూజివీడు ఎమ్మెల్యే ద్వారా ‘అఖండ’ నిర్మాతలు సినిమా విడుదలకు ముందు నన్ను కలవడానికి విజయవాడ వచ్చారు. అదే సమయంలో వారు హీరో బాలకృష్ణతోనూ ఫోన్ లో మాట్లాడించారు. జగన్ ను కలుస్తానని బాలకృష్ణ చెప్పారు. అదే విషయాన్ని నేను సీఎం జగన్ కు తెలిపాను. అయితే ‘అఖండ’ సినిమాకు సంబంధించి బాలకృష్ణ నిర్మాతలకు పూర్తి సహకారం అందించమని జగన్ నాకు చెప్పారు. బాలకృష్ణ తనను కలిస్తే అది వేరే విధమైన ప్రచారానికి కారణమౌతుందని జగన్ అన్నారు. అప్పుడు సీఎం జగన్ ను కలుస్తానని చెప్పిన బాలకృష్ణ ఇప్పుడు కలవనని చెబుతారని నేను అనుకోవడం లేదు. బాలకృష్ణ అబద్ధం చెబుతారని కూడా భావించడం లేదు" అంటూ నాని చెప్పుకొచ్చారు.
నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి చేయూత
(జానో జాగో వెబ్ న్యూస్-అనంతపురం ప్రతినిధి)
మతం ఏదైనా మానవత్వమే మిన్న అంటూ అనంతపురం జిల్లాలో పలు సామాజికే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా పేదలకు ఆర్థికంగా అండగా నిలవడం వారి నైజం. అనంతపురం జిల్లాకు చెందిన మానవహక్కుల నేత ఎన్.జాకీర్ హుస్సేన్, సామాజిక కార్యకర్త షేక్ నిజాం వీరిద్దరు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. తాజాగా వీరు అనంతపురంలోని శుక్రవారంనాడు కళ్యాణ్ దుర్గం రోడ్డు పాపంపేట కు సంబంధించిన ఒక నిరుపేద కుటుంబానికి పెళ్లి ఖర్చుల కోసం రూ.8వేల సహాయం అందేలా చేశారు. పెళ్లి కూతురు తండ్రి ఒక సామాన్య నిరుపేద తోపుడు బండిలో కూరగాయలు వ్యాపారం చేసుకునే నిరుపేద యూనుస్ సహాయం కోరగా వారు మానవతా దృక్పథంతో వారు సహాయం అందేలా చేశారు. అనంతపురం మాసుమాబి-సారాబి దర్గా లో మహాల్ దార్ బంగారు షాపుల యునియన్ల రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్ బాషా చేతుల మీదుగా పెళ్లి ఖర్చులకు గాను రూ.8వేల సహాయం చేసి వితరణచాటుకొన్నారు. ఈ కార్యక్రమంలో హాజీ ఇక్బాల్, ప్రజాబలం జాకీర్. ఎస్ఎంఎస్ గౌస్. జీలాన్. దర్గా ముజావర్ పాల్గన్నారు
ఉక్రెయిన్ లోని తెలుగు విద్యార్థుల కోసం..ఏపీ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్
ఉక్రెయిన్ లోని తెలుగు విద్యార్థుల కోసం ఏపీ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రష్యా యుద్ధానికి దిగడంతో ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్థులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో, స్వదేశానికి వచ్చే మార్గం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, వారికి సహాయపడేందుకు, స్వదేశంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. దీనిపై ఏపీ సీఎస్ సమీర్ శర్మ మాట్లాడుతూ, సీఎం జగన్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ లోని తెలుగు వారి కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. కృష్ణబాబు, గీతేశ్ శర్మ, అరుణ్ కుమార్, ఏ.బాబు, దినేశ్ కుమార్ లతో కూడిన బృందం కంట్రోల్ రూమ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని సీఎస్ వెల్లడించారు. తగిన సమాచారం కోరే వారు 1902కి కాల్ చేసి వివరాలు చెప్పాలని తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటి నెంబర్లు 48660460814, 48606700105 అని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ఇప్పటికే 1000 మంది తెలుగు విద్యార్థులు ఫోన్ చేశారని సమీర్ శర్మ తెలిపారు. ఇదిలావుంటే ఏపీ సీఎం జగన్ ఉక్రెయిన్ లోని తెలుగు విద్యార్థుల క్షేమం కోసం విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ తో మాట్లాడారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వారి పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్ కేంద్రమంత్రితో చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జైశంకర్ సీఎం జగన్ కు భరోసానిచ్చారు. ఉక్రెయిన్ లో నిలిచిపోయిన భారత విద్యార్థులందరినీ భద్రంగా తీసుకువస్తామని అన్నారు. వారిని ఉక్రెయిన్ పొరుగు దేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. తద్వారా వారిని భారత్ తీసుకువచ్చేందుకు వీలవుతుందని వివరించారు.
మరింత దిగొస్తుంది...ఏపీలో స్వల్పంగా కరోనా కేసులు
ఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ బలహీనపడుతోంది. ఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. కొత్తగా 18,915 కరోనా పరీక్షలు నిర్వహించగా, 280 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 44 కేసుల చొప్పున నమోదు కాగా.. ప్రకాశం జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 38 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 496 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,464 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,98,033 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,709 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 14,722కి పెరిగింది.
దేనికైనా ఓ పద్దతి ఉండాలి మరి
ఆధునిక కాలంలో జీవన పద్దతులు మారుతున్నాయి. అందుకే ఏ కాలం వచ్చినా సరే మన జీవన పద్దతులు మాత్రం ఓ పద్దతిగా ఉండాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీవనశైలి పద్ధతి ప్రకారం ఉంటే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండడం సాధ్యమవుతుంది. పద్ధతి లేని జీవనశైలితో ముందుగా ప్రభావం పడేది గుండెపైనే. అందుకని కొన్ని చిన్న మార్పులతో మన గుండెను పదిలంగా కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజులో ఒక్కసారి అయినా కనీసం 10 నిమిషాల పాటు నడవడం సదా శ్రేయస్కరం. వైద్యులు వారంలో ఐదు రోజుల పాటు, ప్రతి రోజు 30 నిమిషాలు నడవాలని సూచిస్తుంటారు. అందరికీ ఇది సాధ్యపడొచ్చు, పడకపోవచ్చు. వీలు కాని వారు కనీసం 10 నిమిషాల పాటు నడవాలి. దీనివల్ల కరోనరీ హార్ట్ డిసీజెస్ బారిన పడకుండా చూసుకోవచ్చు. గుండెను కాపాడే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇంటి పనుల కోసం మెషిన్లపై ఆధారపడకుండా, స్వయంగా ఆచరించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను సీరియస్ గా తీసుకోరు. రోజువారీ బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) తీసుకునే వారితో పోలిస్తే తీసుకోని వారిలో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నట్టు మోనాష్ యూనివర్సిటీ ఎపిడెమాలజీ, ప్రివెంటివ్ మెడిసిన్ విభాగం నిర్వహించిన పరిశోధన తేల్చింది. నిత్యం బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారికి 21 శాతం అధికంగా గుండె జబ్బుల రిస్క్ ఉంటున్నట్టు వీరు గుర్తించారు. ఉదయం వేళల్లో జీవక్రియలు ఎక్కువ క్రియాశీలంగా ఉంటాయి. అందుకని ఆ సమయంలో ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. తీసుకునే ఆహారంతో ఎన్ని కేలరీలు శరీరంలోకి చేరుతున్నాయనే దానిపై అవగాహన కలిగి ఉండాలి. పరిమితికి మించి కేలరీలు తీసుకోవడం వల్ల గ్లూకోజు, కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి. మహిళలు అయితే 2,000 కేలరీలు, పురుషులు అయితే రోజుకు 2,500 కేలరీలు తీసుకుంటే సరిపోతుంది. ప్రాణాయామం, ధాన్యం అన్నవి మనసును ప్రశాంతంగా ఉంచడంలో సాయపడతాయి. మానసిక ఆరోగ్యంతో శారీరక ఆరోగ్యం కూడా దానంతట అదే అలవడుతుంది. ముఖ్యంగా ప్రాణాయామం గుండెకు మేలు చేస్తుందని ఎన్నో పరిశోధనల్లో వైద్యులు గుర్తించారు. జీవనశైలి ఒత్తిడుల దుష్ప్రభావాన్ని తొలగించుకునేందుకు ఇదే చక్కని మార్గం. సానుకూల దృక్పథం కూడా సాయపడుతుంది.
సోము వీర్రాజు ను కలిసిన ఖలీఫాతుల్లాబాషా
(జానో జాగో వెబ్ న్యూస్- విజయవాడ బ్యూరో)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు సోము వీర్రాజును బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా బీజేపీ మైనారిటీ మోర్చా ఫార్మేర్ రాష్ట్ర అధ్యక్షులు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా రీజియన్ ఛైర్మన్ షేక్. ఖలీఫాతుల్లాబాషా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా పురోగతిపై వారు చర్చించుకున్నారు.
ఏ క్షణంలోనైనా అయ్యన్న అరెస్ట్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆయనను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ను దూషించారంటూ అయ్యన్నపై ఫిర్యాదు మేరకు నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి వద్దకు నిన్న వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. నిన్నటి నుంచి పోలీసులు ఆయన ఇంటి వద్దే ఉన్నారు. దీంతో, ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకొన్న భారతీయ విద్యార్థులు..తెలుగువారే ఎక్కువ
ఉక్రెయిన్ లో యుద్దవాతావరణం నెలకొన్నగా అక్కడ మన భారతీయ విద్యార్థులు, అందులోనూ తెలుగువారు ఎక్కువగా చిక్కుకొన్నట్లు సమాచారం. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసేసింది. పర్యవసానంగా వేలాది మంది భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా భారీగానే ఉన్నారు. ఉక్రెయిన్‌లో సుమారు 400 మంది వరకు తెలుగు వారు ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యర్థనలు చేసుకుంటున్నారు. తమ పిల్లలను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు. ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ అధికారులను సంప్రదించి విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని తాము కూడా కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. దీంతో సంబంధిత అధికారులు ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థుల చిరునామాలను సేకరిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం తెలంగాణ ఎన్నారై సెల్ అధికారులకు వారు ఫోన్ చేసి సమాచారాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన సుమారు 350 మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని విదేశీ వ్యవహారాల శాఖ కూడా చెప్పింది. భారత్ నుంచి ఉక్రెయిన్‌కు ఎయిర్ ఇండియా మాత్రమే విమానాలు నడుపుతోంది. అయితే, అక్కడకు వెళ్లిన ఓ ఎయిర్ ఇండియా భారత్‌కు ఖాళీగానే తిరుగు ముఖం పట్టింది. ఈ నెల 26 న భారత్ నుంచి మరో ప్రత్యేక విమానం వెళ్లాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల నడుమ అది వెళ్తుందా? అన్న సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్రానికి ఏపీ సీఎం జగన్ కూడా లేఖరాసి, ఏపీ విద్యార్థులను రప్పించాలని కోరారు.
ఉద్రిక్తత పరిస్థితుల్లో ఉక్రెయిన్ లో మార్షల్ లా అమలు
ఉక్రెయిన్ లో మార్షల్ లా అవుతోంది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఈ మార్షల్ లాను విధించారు. ఈ మేరకు ఇవాళ ఉదయం ఆ దేశాధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ప్రకటన చేశారు. మార్షల్ లా గురించి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అంతా శాంతంగా ఉండాలని సూచించారు. ‘‘ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ మనపై దాడికి ఉపక్రమిస్తున్నట్టు ప్రకటించారు. మన దేశ సైనిక మౌలిక వసతులు, సరిహద్దు దళాలపై దాడులు చేశారు. దేశంలోని చాలా నగరాల్లోనూ బాంబుల మోతలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అంతటా మార్షల్ లా విధిస్తున్నాం. ఇప్పటికే ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మాట్లాడాను. అంతర్జాతీయ సమాజం మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పట్నుంచి ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నా. వీలైతే అందరూ ఇళ్లలోనే ఉండండి. దేశాన్ని కాపాడేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. మొత్తం సైన్యం, మొత్తం రక్షణ శాఖ రంగంలోకి దిగింది. భయపడవద్దు. మనం దృఢంగా ఉండాలి. దేనికైనా సిద్ధంగా ఉండాలి. మనం ఎవరిమీదైనా గెలవగలం’’ అంటూ ప్రకటన చేశారు.
ఈ ఐదూ వెంటనే చేయాలి: ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి
రష్యా దాడులపై ప్రపంచ దేశాలు వెంటనే స్పందించాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు. రష్యా దాడులతో యూరప్, ప్రపంచ భవితవ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ముప్పును తప్పించాలంటే వెంటనే స్పందించాలన్నారు. ప్రపంచ దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాలని పేర్కొంటూ ఐదు డిమాండ్లను ముందుంచారు.
1. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీ కమ్యూనికేషన్స్ (స్విఫ్ట్)తో పాటు మరిన్ని ఆర్థిక ఆంక్షలను రష్యాపై వెనువెంటనే విధించాలి.
2. అన్ని విధాలుగా రష్యాను ఒంటరిని చేయాలి.
3. ఉక్రెయిన్ కు ఆయుధాలు, ఇతర సామగ్రిని వెంటనే సమకూర్చాలి.
4. ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం అందించాలి.
5. మానవతా దృక్పథంతో సాయం చేయాలి.
బెలారస్, క్రిమియా సరిహద్దుల నుంచి దాడులు: ఉక్రెయిన్
కాగా, పలు సరిహద్దుల నుంచి రష్యా తమపై దాడులు చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. బెలారస్, క్రిమియా సరిహద్దుల నుంచి రష్యా బలగాలు చొరబడి దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ సరిహద్దు భద్రతా విభాగం వెల్లడించింది. బెలారస్ సైన్యం మద్దతుతో బెలారస్ సరిహద్దుల ద్వారా రష్యా సైన్యం దాడులకు తెగబడిందని పేర్కొంది. లుహాన్స్క్, స్యూమీ, ఖార్కివ్, చెర్నిహివ్, ఝైటోమిర్ రీజియన్లలో దాడులు జరిగాయని తెలిపింది. సరిహద్దు భద్రతా బలగాలు, బార్డర్ పెట్రోలింగ్, చెక్ పాయింట్లపై భారీ ఆర్టిలరీలతో దాడులు చేశారని చెప్పింది. ఇటు క్రిమియా నుంచి కూడా దాడులు జరిగాయని వెల్లడించింది. కాగా, రష్యా బలగాలకు దీటుగా ఉక్రెయిన్ నేషనల్ గార్డ్స్, సాయుధ బలగాలు కూడా ఎదురు దాడిని చేస్తున్నాయని పేర్కొంది.
స్టెమ్ విద్యకు సంబంధించి బాలికలకు మరింత ప్రోత్సాహం
#స్టెమ్ ది గ్యాప్ కోసం ఉపకరాల వేతనాలు అందించేందుకు గాను ...
భారతదేశ ఎడ్ టెక్ యూనికార్న్ లీడ్ కు నిధులు సమకూరుస్తున్న ఓలే
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ బ్యూరో)
మగపిల్లలకు వాళ్ల పుట్టిన రోజు నాడు రోబో బొమ్మలు లేదా కన్ స్ట్రక్షన్ సెట్స్ లాంటివి బహుమతిగా ఇస్తే, ఆడపిల్లలకు మాత్రం వారి పుట్టిన రోజున కిచెన్ సెట్స్ ను ఎందుకు బహు మానంగా ఇస్తారు? మనలో దాగిఉన్న జెండర్ వివక్ష అనేది బాలికలను వెనుకనే ఉంచుతోందా. ఐక్య రాజ్యసమితి నివేదికల ప్రకారం, భారతదేశంలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) సిబ్బందిలో మహిళలు 14% మాత్రమే ఉన్నారు. సైన్స్ బ్రాండ్ గా ఉంటూ, అదే సమయంలో మహిళల బ్రాండ్ గా గర్వి స్తున్నఅగ్రగామి చర్మసంరక్షణ బ్రాండ్ అయిన ఓలే, స్టెమ్ కెరీర్స్ లో మరింతగా మహిళలు ప్రపంచానికి అవసరమని విశ్వసిస్తోంది. అంతేగాకుండా స్టెమ్ కోర్సులు చదవడంలో భారతదేశంలో ఉన్న లింగ వివక్ష తీరుతెన్నులను మార్చాల్సిన అవసరం ఉందని కూడా నమ్ముతోంది.
సాంస్కృతికపరమైన అడ్డంకులు, జెండర్ పోషించే పాత్రపై అపోహలు లాంటివాటితో మహిళలు తరచుగా సంరక్షకులుగా, గృహిణులుగానే మిగిలిపోతున్నారు. టీచింగ్, నర్సింగ్, కళలు, ఇంటిని చక్కదిద్దుకోవడం లాంటి వాటికే పరి మితమైపోతున్నారు. అందుకే ఈ బ్రాండ్ మరెంతో మంది భారతీయ విద్యార్థినులు స్టెమ్ కోర్సులు చేసేందుకు, వాటిని కెరీర్ గా ఎంచుకునేందుకు వీలుగా తన#స్టెమ్ ది గ్యాప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యాచరణలో భాగంగా ఓలే భారతదేశ స్కూల్ ఎడ్ టెక్ అగ్రగామి లీడ్ తో కలసి స్టెమ్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ను బాలికల కోసం ప్రవేశపెట్టింది.
లీడ్ సంస్థ 12 లక్షల మందికి పైగా విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిం చేందుకు గాను 3000కు పైగా పాఠశాలలతో కలసి పని చేస్తోంది. కరిక్యులమ్ డిజైన్ చేయడంలో ఉపా ధ్యాయులకు తోడ్పాటును అందించడం ద్వారా, విద్యార్థులకు ఆయా భావనలను అర్థంచేయించడంలో మెరుగైన మార్గాల కోసం అన్వేషించడం ద్వారా లీడ్ ఆయా పాఠశాలలను పరివర్తింపజేస్తోంది. పుస్తకాలు, నాణ్యమైన వనరులను కూడా ఈ సంస్థ అందిస్తోంది. ఇతరత్రాగా నాణ్యమైన విద్యను పొందలేని ప్రాంతాల్లో ఓలే స్టెమ్ స్కాలర్ షిప్ కార్యక్రమంలో లీడ్ భాగస్వామిగా మారింది. ఇది బాలికలు తమకు ఆసక్తిగల కోర్సుల్లో తమ చదువును కొనసాగించేందుకు వారికి వీలు కల్పిస్తోంది.
2021 నుంచి కూడా ఓలే దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఈ స్కాలర్ షిప్ కింద బాలికలకు ట్యూషన్ ఫీజు చెల్లిస్తోంది. ట్యాబ్ లు, డేటా ప్యాక్ లు అందిస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ట్యాబ్ లు, డేటా ప్యాక్ లు
అనేవి కూడా ఎంతో కీలకంగా మారాయి. చాలా కుటుంబాలకు ఇళ్లలో ఉండే పిల్లలకు సరిపడా ట్యాబ్ లు ఉండడం లేదు. అలాంటివి సమకూర్చడం ద్వారా బాలికలకు సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అందించి నట్లయింది. ఆన్ లైన్ తరగతులైనా లేదా భౌతికంగా, డిజిటల్ పరంగా కలగలపి హైబ్రిడ్ వాతావరణంలో తరగతులు నిర్వహించినా ఇవి వారికి ఎంతో ముఖ్యమైనవిగా ఉంటాయి.
ఈ సందర్భంగా #స్టెమ్ ది గ్యాప్ కార్యక్రమం గురించి ప్రొక్టర్ అండ్ గాంబుల్ (పి అండ్ జి) సీనియర్ వైస్ ప్రె సిడెంట్ (స్కిన్, పర్సనల్ కేర్ – ఏషియా పసిఫిక్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా) ప్రియాలి కామత్ మాట్లాడుతూ, ‘‘ఓలే అనేది సైన్స్ లో ప్రగాఢ మూలాలు ఉన్న సంస్థ. మా శాస్త్రవేత్తల్లో 50 శాతం మంది మహిళలే. రోజురోజుకు మరెన్నో ఉద్యోగాలు స్టెమ్ ఆధారితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఉద్యోగాల కోసం బాలికలను సన్నద్ధం చేయడం మనందరి బాధ్యత అని మేం విశ్వసిస్తున్నాం. అందుకే స్టెమ్ లో జెండర్ అంతరం భర్తీ చేసేందుకు సాయం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. లీడ్ తో కలసి మా స్కాలర్ షిప్ కార్యక్రమం ఇప్పటికే నిజమైన, అర్థవంతమైన మార్పును తీసుకువచ్చింది. భారతదేశంలోని బాలికలకు సానుకూల భవిష్యత్ అందించడంలో భాగం కావడం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.
లీడ్ సహ వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుమీత్ మెహతా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఓ లే స్కాలర్ షిప్స్ ఎంతో అర్థవంతమైనవి. బాలికలు తమకు ఇష్టమైన వాటిని చదివేందుకు వారిని సిద్ధం చేస్తాయి. పాఠశాలలను మరీ ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ఉన్న వాటిని పరివర్తింపజేయడం ద్వారా ప్రతి చి న్నారికి కూడా చక్కటి విద్య అందించాలన్నది మా ఆశయం. ఓలేతో మా భాగస్వామ్యం విద్యార్థులకు మ రింతగా తోడ్పడేందుకు, ఎవరు ఎక్కడ చదువుకుంటున్నారన్న దానితో సంబంధం లేకుండా చదువు ను మరింత ప్రజాస్వామీకరించేందుకు తోడ్పడుతుంది. బాలికలకు తొలినాటి ఏళ్లు పునాదిలా ఉంటాయి. సానుకూల మార్పు తీసుకు వచ్చేందుకు, స్టెమ్ లో లింగ వివక్షను దూరం చేసేందుకు ఈ సదాశయంలో భాగస్వామ్యం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.
మహారాష్ట్ర రాయ్ గఢ్ జిల్లా కుచెందిన ఉపకారవేతన గ్రహీత రియా బుటె (9) తండ్రి రంజిత్ బుటె ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘నేను ఒక బస్సు డ్రైవర్ ను. నా కుమార్తె ప్రస్తుతం 3వ తరగతి చదువుతోంది. మహమ్మారి సమయంలో మా కుమార్తె పాఠశాల ఫీజులు చెల్లించేందుకు మేం ఎన్నో ఇబ్బందులు పడ్డాం.
మా కుమార్తె చదువులో వెనుకబడుతుందేమోనని భయపడ్డాం. మా కుమార్తె యావత్ విద్యాభ్యాసానికి తోడ్పాటు అందించేలా ఓలె చేపట్టిన ఈ కార్యక్రమం గురించి లీడ్ మాకు పరిచయం చేసింది. దాంతో మేమెంత గానో సంతోషించాం. ఒత్తిళ్లకు గురవుతున్న సమయంలో ఈ విధమైన భారీ సహాయం అందించినందుకు గాను ఓలెకు మరియు లీడ్ కు మేమెన్నటికీ రుణపడి ఉంటాం’’ అని అన్నారు.
#స్టెమ్ ది గ్యాప్ వంటి అర్థవంతమైన కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా స్టెమ్ లో ఉన్న జెండర్ అంతరానికి ముగింపు పలికేందుకు ఓలే కట్టుబడి ఉంది. మనలో అనాలోచితంగానే ఉంటున్న ధోరణి స్టెమ్ కోర్సులు అనేవి బాలికలకు కాదు అనే విషయాన్ని ఎలా బయటకు తెస్తుందన్నఅంశాన్ని బలంగా కనిపించేలా ఫిల్మ్ ను ఈ బ్రాండ్ తీసుకువచ్చింది. #స్టెమ్ ది గ్యాప్ కోసం మనమంతా కలసికట్టుగా పని చేసేందుకు పిలుపునిచ్చింది.
ఐదు యుద్ధ విమానాలు, ఒక హెలికాఫ్టర్‌ను పేల్చేశాం: ఉక్రెయిన్ వెల్లడి
రష్యా దాడుల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఐదు యుద్ధ విమానాలు, ఒక హెలికాఫ్టర్‌ను పేల్చేశామని ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సేనలు సమర్థంగా ప్రతిస్పందిస్తున్నాయి. లుహాన్స్క్ ప్రాంతంలో ఐదు రష్యా యుద్ధ విమానాలు, ఒక హెలికాఫ్టర్‌ను పేల్చేశామని ఉక్రెయిన్ ప్రకటన చేసింది. అలాగే, ప్రధాన నగరాల్లో తమ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని ప్రకటించింది. తమ దేశ భద్రత కోసం సైనికులు పూర్థి స్థాయిలో పోరాడతారని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. కాగా, ఉక్రెయిన్లో జనావాసాలపై తాము దాడులు చేయబోమని రష్యా ప్రకటన చేసింది. ఉక్రెయిన్ ఎయిర్బేస్లు, సైనిక స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులనే లక్ష్యంగా చేసుకుని పోరాడుతున్నట్లు తెలిపింది.
గగనతల వినియోగాన్ని నిషేధిస్తూ ఉక్రెయిన్ ఆదేశాలు
రష్యాతో నెలకొన్న యుద్ద పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకొంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తూర్పున ఉన్న నగరాల్లో ఎయిర్ పోర్టులను మూసివేసింది. అలాగే, పౌర విమాన ప్రయాణాల కోసం గగనతల వినియోగాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తూర్పు ఉక్రెయిన్లోని గగనతలాన్ని డేంజర్ జోన్‌గా ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్‌లోనే భారత్ సహా పలు దేశాల పౌరులు చిక్కుకుపోయారు. భారతీయులను వెంటనే వెనక్కు వచ్చేయాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా హెచ్చరికలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఉక్రెయిన్‌లోనే ఉన్నారు. ఈ రోజు ఉదయం ఎయిర్ ఇండియా విమానం AI1947 భారతీయులను తీసుకురావడానికి ఉక్రెయిన్ వెళ్లగా, ఆ దేశంలోకి అనుమతి దొరకకపోవడంతో తిరిగి న్యూఢిల్లీకి మళ్లింది. దీంతో ఉక్రెయిన్‌లోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు.a
హుందాగా, అద్భుతంగా, హత్తుకునేలా, భావోద్వేగభరితంగా ఉంది
వివాదస్పద వ్యాఖ్యల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సారి పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు తరలి వచ్చారు. మంత్రి కేటీఆర్ ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ స్పీచ్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పవన్ ప్రసంగం ఎంతో హుందాగా, అద్భుతంగా, మనసును హత్తుకునేలా, భావోద్వేగభరితంగా ఉందని ఆయన కితాబునిచ్చారు. ఆయన ప్రవర్తన ఎంతో మర్యాదపూర్వకంగా ఉందని చెప్పారు.
సంగీత ఔత్సాహికురాలు...
అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ ద్వారా ఆమె పాట పాడింది
(జానో జాగో వెబ్ న్యూస్- వరంగల్ ప్రతినిధి)
:అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్, దక్షిణాసియా, మధ్యప్రాచ్యంలోని మొట్టమొదటి ఏకైక ప్రోటాన్ థెరపీ సెంటర్, రోగి పాడుతున్నప్పుడు మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగికి పాలియేటివ్ మాస్టెక్టమీని నిర్వహించింది. అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్‌లోని సర్జన్ మాట్లాడుతూ, రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స సమయంలో రోగి మెలకువగా, పాడటం, విస్తృతమైన ఊపిరితిత్తుల మెటాస్టేజ్‌లు ఉన్నప్పటికీ మరియు ఆమె ఆందోళనను అధిగమించడం ఇదే మొదటిసారి అని చెప్పారు.
చెన్నైకి చెందిన సీతాలక్ష్మి, క్లాసికల్ సింగర్ మరియు టీచర్, అధునాతన రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు, కొన్ని నెలల క్రితం అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్‌లోని బ్రెస్ట్ ఆంకాలజీ విభాగంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో, క్యాన్సర్ ఆమె శరీరమంతా మరియు ప్రధానంగా ఆమె ఊపిరితిత్తులకు వ్యాపించింది కాబట్టి, ఆమె పూర్తిగా వాక్యం మాట్లాడలేకపోయింది. కీమోథెరపీ మరియు టార్గెటెడ్ థెరపీ యొక్క కొన్ని చక్రాల తర్వాత ఆమె నాటకీయంగా మెరుగుపడింది, తద్వారా ఆమె బాగా ఇష్టపడేదాన్ని తిరిగి పొందగలిగింది, అంటే పాడటం, కానీ ఆమె విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులను కూడా తిరిగి ప్రారంభించింది. మల్టీడిసిప్లినరీ బృందం వ్రణోత్పత్తి రొమ్ము కణితి కోసం పాలియేటివ్ మాస్టెక్టమీ యొక్క ఏకాభిప్రాయానికి వచ్చారు; ఆమె చికిత్స చేసే సర్జన్ మరియు మత్తుమందు మరొక సవాలును ఎదుర్కొన్నారు. ఊపిరితిత్తుల మెటాస్టాసిస్ విస్తృతమైన ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినడం, న్యుమోథొరాక్స్ (ఊపిరితిత్తుల వెలుపల గాలిని లాక్ చేయడం) మరియు రెండు ఊపిరితిత్తుల స్థావరాలలో ద్రవం సేకరణకు కారణమైంది, సాధారణ అనస్థీషియాకు ఆమె అనర్హమైనది, శస్త్రచికిత్స చేయించుకోవడంలో రోగి యొక్క ఆందోళనను మరచిపోకూడదు.
సీతాలక్ష్మికి సాధారణ అనస్థీషియా కింద శస్త్ర చికిత్స చేయడం చాలా ప్రమాదంతో కూడుకున్నది మరియు చాలా రోజుల పాటు వెంటిలేటర్ మరియు ICU సంరక్షణ అవసరం కావచ్చు. అటువంటి సమస్యలను నివారించడానికి, కన్సల్టెంట్ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జన్ డాక్టర్ మంజులరావు మరియు అనస్థీషియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ డి.ఇందుమతి ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. రోగికి అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలు మరియు ప్రతి టెక్నిక్ యొక్క లాభాలు మరియు నష్టాల గురించి వైద్యులు మూడు వేర్వేరు సందర్శనలలో విస్తృతంగా సలహా ఇచ్చారు. ఆమె అవుట్‌పుట్ ఆధారంగా, డాక్టర్ మంజులా రావు &డాక్టర్ ఇందుమతి, ఎపిడ్యూరల్ అనస్థీషియా కింద శస్త్రచికిత్స చేయడంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు, ఇందులో వెన్నెముక వెలుపల ఉన్న ఎపిడ్యూరల్ ప్రదేశంలో ఉంచిన చిన్న కాథెటర్‌లోకి మత్తుమందును పంపిణీ చేస్తారు. త్రాడు. ఆమె అభ్యర్థన మేరకు, వారు ఆమె ఆందోళనను తగ్గించడానికి శస్త్రచికిత్స సమయంలో ఆమెకు తేలికపాటి మత్తు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
శస్త్రచికిత్స రోజున, శ్రీమతి సీతాలక్ష్మిని ఆపరేషన్ థియేటర్‌లోని రికవరీ ఏరియాలో స్వీకరించినప్పుడు, ఊహించినట్లుగానే ఆమె ఆందోళన చెందింది; ప్రక్రియ మరియు కౌన్సెలింగ్ యొక్క బహుళ సెషన్ల గురించి పూర్తిగా తెలియజేసినప్పటికీ. ఆమె వైద్యులు ఆమె నరాలను శాంతపరచడానికి సంగీతాన్ని ప్లే చేశారు. ఆమె బాగా రిలాక్స్‌గా ఉన్నప్పుడు ఎపిడ్యూరల్ కాథెటర్ పరిచయం చేయబడింది మరియు థియేటర్‌లోకి చక్రాలు వేసింది, బ్యాక్‌గ్రౌండ్‌లో ఓదార్పు సంగీతాన్ని ప్లే చేస్తుంది. "పదాలు విఫలమైన చోట సంగీతం మాట్లాడుతుంది..." అన్న సామెత ప్రకారం, డాక్టర్ మంజులరావు ఆపరేషన్ చేయడం ప్రారంభించినప్పుడు ఆమె అభ్యర్థన మేరకు ఆమె స్వల్పంగా మత్తుగా ఉంది, అది క్రమంగా మాన్పించబడింది మరియు ఆమె మెల్లగా మెలకువ వచ్చింది, అయితే శస్త్రచికిత్స సగానికి చేరుకుంది. ఆ తర్వాత, ఆమె తన సర్జన్ మరియు అనస్థీటిస్ట్‌తో చాట్ చేయడం ప్రారంభించింది మరియు తరువాత, "థియేటర్‌లో వాతావరణం ఉల్లాసంగా మరియు సంతోషంగా ఉంది" అని పేర్కొంది. ఒక పాట పాడమని అభ్యర్థించినప్పుడు, ఆమె వైద్యుల బృందం యొక్క ఆనందం, ప్రశంసలు మరియు ఆశ్చర్యానికి చాలా బాధ్యత వహించింది. ఆమె రికవరీ వార్డుకు మార్చబడింది, శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత, పూర్తిగా మేల్కొని, హాయిగా, నొప్పి గురించి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా, మరియు శస్త్రచికిత్స సమయంలో ఆమె నిజంగా పాడినందుకు చాలా సరదాగా ఉంది! ఒక గంట వ్యవధిలో, ఆమె తన గదికి మార్చబడింది, నోటితో ఆహారం ఇవ్వడం ప్రారంభించబడింది మరియు ఆమె తనంతట తానుగా రెస్ట్‌రూమ్‌కి వెళ్లింది, రెండు గంటల వ్యవధిలో. ఆమె రాత్రిపూట గమనించబడింది మరియు మరుసటి రోజు డిశ్చార్జ్ చేయబడింది.
అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్‌లోని అంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జన్ కన్సల్టెంట్ డాక్టర్ మంజులరావు మాట్లాడుతూ, “శ్రీమతి సీతాలక్ష్మి కోలుకోవడం పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను మరియు రోగికి ఎంత విస్తృతమైన కౌన్సెలింగ్ మరియు ఆమె వివిధ ఎంపికల గురించి బాగా తెలియజేయడం మరియు నిర్ణయాన్ని పంచుకోవడం పట్ల సంతృప్తి చెందాను. మేకింగ్, ఆమె చాలా సులభంగా క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా వెళ్ళడానికి సహాయపడింది. పరిశోధనలో అభివృద్ధి, ఆధునిక ఔషధాలు మరియు కొత్త శస్త్ర చికిత్సలు కలిసి క్యాన్సర్ రోగి యొక్క మొత్తం జీవన నాణ్యతను, అధునాతన దశలలో కూడా మెరుగుపరచడంలో దోహదపడ్డాయి. పురుషులు మరియు మహిళలు ఏవైనా కొత్త లక్షణాల గురించి జాగ్రత్త వహించడం మరియు వారి వైద్యులకు వీలైనంత త్వరగా నివేదించడం చాలా ముఖ్యం. రొమ్ము క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణ లక్షణం నొప్పిలేని గడ్డ, మరియు క్యాన్సర్ శోషరస కణుపులకు వ్యాపించే ముందు చికిత్స చేస్తే, పూర్తిగా నయం అయ్యే అవకాశాలు 99% వరకు పెరుగుతాయి!
అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్, అనస్థీషియాలజిస్ట్, కన్సల్టెంట్ డాక్టర్ ఇందుమతి మాట్లాడుతూ, “సాంప్రదాయ సాధారణ అనస్థీషియాకు ఎక్కువ ప్రమాదం ఉన్న రోగిలో మత్తుమందు పద్ధతుల యొక్క ప్రత్యామ్నాయ పద్ధతులను పరిగణనలోకి తీసుకునే అవకాశం కీలకం. ఈ కేసు యొక్క ప్రధాన అంశం ఏమిటంటే, శస్త్రచికిత్సకు ముందు కౌన్సెలింగ్ చేయడం మరియు రోగి యొక్క అవసరాలు మరియు ఆందోళనలను వినడం, ప్రక్రియ అంతటా ఆమెను సౌకర్యవంతంగా ఉంచడానికి, అలాగే ఎపిడ్యూరల్ బ్లాక్‌తో పాటు”. ఈ సందర్భంగా, అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ హరీష్ త్రివేది మాట్లాడుతూ, “అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ (APCC)లో మేము మా రోగులకు ‘టెండర్ లవింగ్ కేర్’ అందించడానికి చాలా మక్కువ చూపుతున్నాము. APCCలో ఇది ఒక సైన్స్ లాగా ఆచరిస్తారు. ఇది అత్యుత్తమ అభ్యాసాల డెక్‌ను కలిగి ఉంటుంది, APCCలోని ప్రతి ప్రక్రియ రోగి-కేంద్రీకృతంగా ఉండేలా పరిపూర్ణం చేయబడిన విస్తృత శ్రేణి వ్యవస్థలను కలిగి ఉంటుంది. వ్యాధి యొక్క మానసిక మరియు మానసిక ప్రభావం చాలా ముఖ్యమైనది. ఇది ఒక కఠినమైన యుద్ధం మరియు మేము మా ఉత్తమ సామర్థ్యంతో సీతాలక్ష్మికి సహాయం చేయగలిగినందుకు మేము సంతోషిస్తున్నాము.
చికిత్స పొందినందుకు తన ఆనందాన్ని పంచుకుంటూ, పేషెంట్ శ్రీమతి సీతాలక్ష్మి మాట్లాడుతూ, “నేను వృత్తిరీత్యా క్లాసికల్ సింగర్ మరియు టీచర్‌ని. నాకు ఇళయరాజా పాటలంటే చాలా ఇష్టం, మేము ఆపరేషన్ థియేటర్‌లోకి అడుగుపెట్టినప్పుడు, సర్జరీ సమయంలో నన్ను పాడిన సంగీతాన్ని నేను వింటున్నాను. డాక్టర్ మంజులా రావు మరియు మొత్తం అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ బృందం నాకు ఆశను కలిగించింది మరియు వారి నైపుణ్యం, నైపుణ్యం మరియు విశ్వాసం కారణంగానే నేను ఈ రోజు జీవించి ఉన్నాను. నాకు కొత్త జీవితాన్ని అందించినందుకు నేను ఎల్లప్పుడూ వారికి కృతజ్ఞతతో మరియు కృతజ్ఞతతో ఉంటాను.
మొత్తం మీద, ఇది చాలా ప్రత్యేకమైన క్షణం మరియు రోగికి, చికిత్స చేస్తున్న వైద్యుల బృందానికి మరియు అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్‌కు గర్వకారణమైన రోజుగా మార్చబడింది, ఎందుకంటే వారు వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ సంరక్షణను అందించడంలో తమ ప్రియమైన చైర్మన్ యొక్క విలువలను సమర్థించారు. నిబద్ధత మరియు అభిరుచితో, ఆరోగ్య సంరక్షణ యొక్క ప్రపంచ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నప్పుడు.
సంగీత విద్వాంసుడు ఇళయరాజా పాట పాడిన శ్రీమతి సీతాలక్ష్మి వీడియో వైరల్‌గా మారింది మరియు ఈ అద్భుతం గురించి తన ఆనందాన్ని పంచుకోవడానికి మాస్ట్రో శ్రీమతి సీతాలక్ష్మి &డాక్టర్ మంజులరావును తన ఇంటికి ఆహ్వానించారు.
ఆ సినిమా ఎవరూ చూడకూదని ఆదేశిస్తారేమో: వర్ల రామయ్య
పవన్ కల్యాణ్ సినిమా ఎవరూ చూడకూడదని ఏపీ సర్కార్ అదేశాలిస్తుందేమోనని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా రేపు విడుదల అవుతుండడంతో ఏపీ ప్రభుత్వం థియేటర్లకు పలు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేయడానికి వీల్లేదని, టికెట్ల ధరలు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని నోటీసులు పంపింది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఒక్క సినిమా విడుదల పట్ల రాష్ట్ర సర్కారు ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తోందని ఆయన ప్రశ్నించారు. ఐదు షోలు వెయ్యకూడదంటూ సినిమా హాళ్లకు నోటీసులిస్తున్నారని ఆయన అన్నారు. ఆ సినిమా ఎవరూ చూడకూడదని కూడా ఆదేశాలిస్తారేమో! అంటూ ఆయన చురకలంటించారు. రైతులు, దళితులు, మహిళల సమస్యలు ప్రభుత్వానికి పట్టవని, కానీ ఆ సినిమా మాత్రం పెద్ద సమస్య అయిందా? అని నిలదీశారు.
కచోరి కోసం రైలును ఆపేసిన డ్రైవర్
మనస్సు కు నచ్చిన ఆహారం తినే యోగం లేకపోతే కాస్త నిరుత్సాహం చెందుతాం. కానీ ఆ రైలు మాత్రం అలా నిరాశచెందడం ఇష్టంలేక ఏం చేశాడో తెలుసా...? రైలు వేగంగా వెళుతోంది. విండో నుంచి బయటకు చూసినప్పుడు నచ్చిన ఆహార పదార్థం కనిపిస్తే పరిస్థితి ఏంటి? కారు మాదిరిగా రైలును ఆపేసి కొనుక్కోగలమా? సాధ్యం కాదు. రైలును నడిపే లోకో పైలట్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తనకు నచ్చిన కచోరి తినాలనిపించింది. అంతే స్టేషన్ దాటిన వెంటనే బ్రేక్ వేసి ఆపేశాడు. ఒక వ్యక్తి తీసుకొచ్చిన కచోరి పార్సిల్ కవర్ ను తీసుకుని అంతే వేగంగా రైలును ముందుకు పోనిచ్చాడు. రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో పెద్ద సంచలనంగా మారిపోయింది. ఒక ట్విట్టర్ యూజర్ దీన్ని షేర్ చేశాడు. కొందరు దీన్ని తప్పుబడితే, మరికొందరు నెట్టింట సమర్థించారు. చట్టవిరుద్ధంగా పైలట్ ఎలా వ్యవహరిస్తాడని కొందరు ప్రశ్నించారు. దీంతో నార్త్ వెస్టర్న్ రైల్వే క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. రైలును నడిపిన లోకో పైలట్, అదే రైలులోని అసిస్టెంట్ లోకోపైలట్, ఇద్దరు గేట్ మ్యాన్ లు, స్టేషన్ మేనేజర్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై నార్త్ వెస్టర్న్ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శశికిరణ్ మాట్లాడుతూ.. ‘‘మా దృష్టికి ఒక వీడియో వచ్చింది. అందులో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ కు గేట్ మ్యాన్ ప్యాకెట్ అందిస్తున్నట్టు ఉంది. వెంటనే చర్యలు తీసుకున్నాం’’ అని ప్రకటించారు.
విలన్ గా విక్రమ్...మహేశ్ బాబు చిత్రంతో ఎంట్రీ
పేరుగాంచిన సినిమా హీరోలు సైతం ఇటీవల విలన్ గా ఎంట్రీ ఇవ్వడం ఓ ట్రెండ్ గా మారుతోంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో విలన్స్ గా కోలీవుడ్ స్టార్స్ కనిపిస్తున్నారు. అరవింద్ స్వామి ... విజయ్ సేతుపతి .. సముద్రఖని .. అర్జున్ వంటి వారు ఇక్కడ పవర్ఫుల్ ప్రతినాయకులుగా తమ హవాను కొనసాగిస్తున్నారు. ఆ జాబితాలో హీరో విక్రమ్ కూడా చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ శోభనను తీసుకున్నారని అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం హీరో విక్రమ్ ను సంప్రదిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్రకి ఆయన అయితేనే బాగుంటాడనే ఉద్దేశంతో ఆయనను ఒప్పించడానికి త్రివిక్రమ్ ట్రై చేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది. త్రివిక్రమ్ - మహేశ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ఇది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం...తెలుగు బోధనకు మొగ్గు
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలుగు ప్రజలకు శుభవార్త అందించింది. మధ్యప్రదేశ్ పాఠశాలల్లో తెలుగు భాష వినపడనుంది. మధ్యప్రదేశ్ ప్రజల్లో అత్యధిక మంది హిందీ మాట్లాడతారన్న విషయం తెలిసిందే. అయితే, పాఠశాలల్లో తెలుగు కూడా బోధించనున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న ప్రపంచ మాతృభాషా దినోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ విద్యా శాఖ.. పాఠశాలల్లో విద్యార్థులకు హిందీ, ఆంగ్లంతో పాటు తెలుగు బోధించాలని నిర్ణయించింది. మధ్యప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా ఇతర రాష్ట్రాల భాషలను విద్యార్థులకు బోధించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయించినట్లు విద్యా శాఖ తెలిపింది. మొదట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తెలుగు భాషను బోధించనున్నారు.
విజయ్ దేవరకొండ సరసన కియారా అద్వాని
హీరో విజయ్ దేవరకొండ సరసన జోడీకట్టడానికి కియారా అద్వాని ఓకే చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ భామలు ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నారు. తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటం .. పారితోషికం పరంగా కూడా బాగా గిట్టుబాటు అవుతుండటంతో ఇక్కడి సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎంతమాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అలా ఇప్పుడు విజయ్ దేవరకొండతో జోడీకట్టడానికి కియారా అద్వాని ఓకే చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా చేస్తున్నాడు. ఆగస్టులో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఆ తరువాత సినిమాను ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కోసమే కియారాను సంప్రదించడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయిందని చెబుతున్నారు. 'భరత్ అనే నేను' .. 'వినయ విధేయ రామ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కియారా, ఆ తరువాత సినిమాను శంకర్ దర్శకత్వంలో చరణ్ సరసన చేస్తోంది. ఈ ప్రాజెక్టు తరువాత ఆమె చేయనున్నది విజయ్ దేవరకొండతోనే అంటున్నారు.
మహానగరంలో వాయూ నాణ్యత ఓ మోస్తారులో ఉందటా
మహానగరం భాగ్యనగరంలో వాయూ కాలుష్యంపై కాస్త ఊరాటనిచ్చే వార్త అందింది. హైదరాబాద్ లో కాలుష్యానికి సంబంధించిన ఆసక్తికరమైన గణాంకాలను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) రూపంలో కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసింది. దీని ప్రకారం.. 2021లో 155 రోజుల పాటు మోస్తరు వాయు నాణ్యత నమోదైంది. హైదరాబాద్ లో గడిచిన మూడేళ్లలో గాలి నాణ్యత మోస్తరుగా ఉండే రోజులు పెరిగాయి. వాయు నాణ్యతను 'బాగుంది, సంతృప్తిగా ఉంది, మోస్తరుగా ఉంది, బాగోలేదు, అస్సలు బాగోలేదు, దారుణంగా ఉంది' అనే వర్గాలుగా ఏక్యూఐ పేర్కొంది. సంతోషకరమైన విషయం ఏమిటంటే.. వాయు నాణ్యత అస్సలు బాగోలేకపోవడం, దారుణంగా ఉండడం అన్నది హైదరాబాద్ లో నమోదు కాలేదు. 2019లో 76 రోజుల పాటు వాయు నాణ్యత బాగుంది అనే స్థాయిలో నమోదైంది. 2020లో 113 రోజుల్లో, 2021లో 109 రోజుల్లోనూ వాయు నాణ్యత బాగుంది. ఏక్యూఐ వాయు నాణ్యతను 0 నుంచి 500 మధ్య స్కోరుతో పేర్కొంటుంది. 500 ఉంటే వాయు నాణ్యత అధ్వానంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా 300 కంటే ఎక్కువ స్కోరు ఉంటే ఆరోగ్యానికి పెను ముప్పు ఉన్నట్టు. కరోనాతో ఎక్కువ రోజుల పాటు లాక్ డౌన్ లు, ఆంక్షలు విధించిన 2020లో మోస్తరు వాయు నాణ్యత 95 రోజుల్లో నమోదు కాగా.. 2021లో 155 రోజుల్లో మోస్తరు స్థాయిలో ఉండడం గమనించాలి. 2019లో 154 రోజుల్లోనూ మోస్తరుగానే ఉంది.
మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటు
సొసైటీ ఆఫ్ ఇంటలెక్చువల్ వాయిస్
(జానో జాగోో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)
మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటు అని సొసైటీ ఆఫ్ ఇంటలెక్చువల్ వాయిస్ అధ్యక్షులు ఐఎం అహ్మద్ పేర్కొన్నారు. విశాఖను కాలుష్య రహిత ప్రాంతంగా అభివృద్ధి చేయడంతోపాటు ఐటి హబ్ గా ఈ ప్రాంతం ఎదిగేందుకు గౌతంరెడ్డి ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. అందుకే మంత్రి గౌతమ్ రెడ్డి విశాఖకు ఆప్తుడు అయ్యారని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో పాటు పరిశ్రమల అభివృద్ధి తోనే విశాఖ నగరం అభివృద్ధి సాధ్యమని ఆయన భావించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు కృషి చేసి నిజాయితీతో వ్యవహరించిన మంత్రి గౌతమ్ రెడ్డి అని కొనియాడారు. గౌతమ్ రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశం
(జానో జాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)
ఈ రోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ సమావేశం విజయవాడలోని oyo హోటల్ బీఎస్ఆర్ కాన్ఫరెన్స్ హల్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపి ఛైర్మన్ ఉన్నెం ఉషా అధ్యక్షత న జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా రీజియన్ ఛైర్మన్ షేక్. ఖలీఫాతుల్లాబాషా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ను సంప్రదించిన అభాగ్యులకోసం అండగా నిల్చి వాళ్ళ సమస్యలు చట్ట పరిధిలో పరిష్కరమార్గం చూపుతూ రాజ్యాంగం కల్పించిన మానవ హక్కుల ప్రతిఫలాలను అందించే దిశగా ప్రయాణం చేస్తున్నామని అన్నారు.మార్చి నెలలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరుపున విజయవాడలో కులమతాలకు అతీతంగా వివాహ వేదిక ఏర్పాటు చేసి నిరుపేద జంటలకు వివాహాలు చేస్తున్నామని తెలిపారు. నిరంతరం ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి హక్కులు వారికి అందే విధముగా ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కృష్ణా జిల్లా వార్కిగ్ అధ్యక్షురాలు శిరీష రాణి తదితరులు పాల్గొన్నారు.
ఆసక్తికరంగా సాగిన...లివర్ పూల్ టీం ఘన విజయం
ఫుట్ బాల్ అంటేనే ఆసక్తికరమైన ఆట. ఆట తీరు సహజంగానే ఉత్కంఠంగా సాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులను సంపాదించుకున్న ఆట ఫుట్‌బాల్. గోల్ వేయాలంటే ఫుట్‌బాల్ ఆటగాళ్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. ప్రత్యర్థి ఆటగాళ్లను దాటుకుంటూ ఆటగాళ్లు గోల్ వేయాలని ప్రయత్నాలు జరుపుతోన్న సమయంలో ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. అయితే, ఈ గోల్ చేసే ముందు జట్టులోని ఆటగాళ్ల మధ్య 34 పాస్‌లు జరగడం చాలా అరుదుగా జరుగుతుంది. అంటే ప్రత్యర్థి ఆటగాళ్లకు ఫుట్‌బాట్ చిక్కకుండా ఓ జట్టులోని ఆటగాళ్లు తమ జట్టులోని వారికి బంతి చిక్కేలా సమర్థంగా ఆడడం. ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నార్విచ్ సిటీతో జరిగిన మ్యాచ్‌లో లివర్‌పూల్ టీమ్ ఇటువంటి అరుదైన గోల్ చేసి అందరి ప్రశంసలూ అందుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గోల్ చేసే ముందు టీమ్‌లోని ఆటగాళ్ల మధ్య 34 పాస్‌లు జరిగాయి. ఒక్కసారి కూడా ప్రత్యర్థి జట్టుకు బంతి చిక్కలేదు. తీవ్ర ఉత్కంఠతో ప్రేక్షకులు ఊపిరిబిగపట్టుకుని ఈ మ్యాచ్ చూశారు. లివర్‌పూల్ సిటీ టీమ్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పంచుకుంది. చివరకు ఈ మ్యాచ్‌లో లివర్‌పూల్ టీమ్ గెలుపొందింది.