విచారణ నిర్వహించిన.. 

గడివేముల ఎంఈఓ బ్రహ్మం

 విచారణ జరుపుతున్న ... గడివేముల ఎంఈఓ బ్రహ్మం

(జాగో జానో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండల పరిధిలోని కొరటమద్ది ఎంపియుపి పాఠశాలలో ఎంఈఓ బ్రహ్మం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే కొరటమద్ది ఎం పి యు పి పాఠశాలకు సంబంధించి  05-01-22 వ తేదీన సోషల్ మీడియాలో మరియు మీడియాలో వచ్చినటువంటి వార్తల కు స్పందించిన ఉన్నతాధికారులు ఎంఈఓ బ్రహ్మంని ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమించారు, ఎంఈఓ బ్రహ్మం కొరటమద్ది పాఠశాల లోని ఉపాధ్యాయులను, విద్యార్థులను, విద్యా కమిటీ చైర్మన్ ను  మరియు

కొరటమద్ది ఎం పి యు పి పాఠశాలలో విచారణ చేస్తున్న ఎంఈవో బ్రహ్మం

విద్యార్థుల తల్లిదండ్రులను విడివిడిగా విచారించారు, ఈ విచారణలో 26 మంది విద్యార్థినీ ,విద్యార్థులు లిఖితపూర్వకంగా  05-01-22 వ తేదీన పిల్లలచే సతీష్ కుమార్ ,హిందీ పండిట్ నాగ సుందరి, మాట్లాడి చ్చినటువంటి  మాటలు అవాస్తవమని, ఉపాధ్యాయులు అందరూ పాఠశాలలో సబ్జెక్టులు అన్ని సక్రమంగా బోధిస్తున్నారు అని విద్యార్థిని,విద్యార్థులు, కమిటీ చైర్మన్, అందరూ లిఖితపూర్వకంగా వ్రాసి ఇచ్చారని తెలియజేశారు. విచారణ జరిపిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని ఎంఈఓ  బ్రహ్మం తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: