పాఠశాలలకు సెలవులు పొడగించాలి

జానో జాగొ సంఘం డిమాండ్


(జాగో జానో వెబ్ న్యూస్- నంద్యాల ప్రతినిధి)

రోజురోజుకు కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి మహబూబ్ భాషా మైనార్టీ నాయకులు మస్తాన్ బాబా మాట్లాడుతూ  15 ఏళ్లలోపు పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాలేదు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈసారి కరోనా కేసుల్లో ఎక్కువగా బాధితులు అవుతున్నది చిన్నపిల్లలని పలువురు శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారని ఆయన పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులను పొడిగించడం శ్రేయస్కరమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ దిశగా చర్యలు తీసుకున్నాయి అని ఆయన పేర్కొన్నారు. చిన్న పిల్లల ప్రాణాలను పణంగా పెట్టే లా పాఠశాలలను తెరవడం సబబు కాదేమో అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం పునరాలోచన చేసి విద్యా సంస్థల సెలవులను పొడగించాలని ఆయన కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: