విలన్ వేషాలే కలిసొచ్చాయి...అందుకే ఆమె స్టార్ అవుతోంది


మనకు నచ్చిన రీతిలో కాకుండా మనల్ని శిఖరాలకు ఎక్కించే వేషాలను నమ్ముకొంటే చిత్ర పరిశ్రమలో లాభపడతారు. కోలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా .. కథానాయికగా వరలక్ష్మి శరత్ కుమార్ అడుగుపెట్టింది. అయితే కథానాయికగా ఆమెకి ఆశించిన స్థాయి ఆదరణ లభించలేదు. దాంతో వెంటనే ఆమె విలన్ రోల్స్ వైపు దృష్టిపెట్టింది. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రలు ఆమెకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' సినిమా ద్వారా తెలుగులో కూడా ఆమె విలన్ గానే ఎంట్రీ ఇచ్చింది. ఇక రవితేజ 'క్రాక్' సినిమాతో ఆమె విలనిజం ఇక్కడి ప్రేక్షకులకు మరింతగా నచ్చేసింది. దాంతో ఆమె తెలుగులోనూ బిజీ అవుతోంది. బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలో ఆమె విలన్ గా కనిపించనుంది. ఇక సమంత 'యశోద' సినిమాలోను ఒక కీలకమైన పాత్రను చేస్తోంది. 'మైఖేల్' సినిమాలోను ఆమె విలన్ రోల్ కి సమానమైన రోల్ చేస్తోందట. గౌతమ్ మీనన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, సందీప్ కిషన్ .. విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను చేస్తున్నారు. రంజిత్ జయ కోడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా అలరించనుంది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో వరలక్ష్మి పాన్ ఇండియా స్టార్ అవుతోందన్న మాట!

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: