భారీ ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సల్స్ మృతి


మరోసారి గ్రేహౌండ్స్ దళాలు...నక్సల్ మధ్య జరిగిన కాల్పులో మావోయిస్టులు మరణించారు. తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో తుపాకులు గర్జించాయి. బీజాపూర్ సమీపంలోని కర్రెలగుట్ట అటవీప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. మరణించిన మావోయిస్టుల్లో ఎటూరు నాగారం-మహదేవ్ పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. కాగా, ఈ కాల్పుల ఘటనలో ఒక గ్రేహౌండ్స్ జవాన్ కు తీవ్రగాయాలు కావడంతో అతడిని హెలికాప్టర్ ద్వారా వరంగల్ తరలించారు. ఈ మేరకు బస్తర్ రేంజి ఐజీ పి.సుందర్ రాజ్ వివరాలు తెలిపారు. సంఘటన స్థలం పరిసరాల్లో ప్రస్తుతం గాలింపు జరుగుతోందని వివరించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: