నంద్యాల కడప డెమో రైలు పున:ప్రారంభాలి 

 ముస్లిం ప్రజా సంఘాల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

నంద్యాల కడప డెమో రైలు పున:ప్రారంభానికి ఎంపీ కృషి చేయాలని, ఇందుకు నంద్యాల  ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ప్రత్యేచ చొరవ తీసుకోవాలని ఆవాజ్, జానోజాగో సంఘం డిమాండ్ చేసింది.  నంద్యాల లో ఏర్పాటుచేసిన సమావేశంలో  ఆవాజ్ జిల్లా కన్వీనర్ ఎస్ మస్తాన్వలి జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ భాష వారు మాట్లాడుతూ   నంద్యాల నుంచి బనగానపల్లె కోవెలకుంట్ల జమ్మలమడుగు ప్రొద్దుటూరు మీదుగా కడపకు పోవు నంద్యాల కడప డెమో రైలు ప్రారంభించాలని


ఈ రైలు వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉండేదని నంద్యాల నుంచి కడప పెద్ద దర్గా కు పోనీ కి చాలా అనుకూలంగా ఉండేది అలాగే తిరుపతికి పోనీ కూడా పేద ప్రజలకు అనుకూలంగా ఉందని ఎర్రగుంట్ల జంక్షన్ నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలకు పేద చిన్న వ్యాపారస్తులకు

అనుకూలంగా ఉండేది కాబట్టి ఇప్పటికైనా మన నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు చొరవ తీసుకొని రైల్వే అధికారులతో మాట్లాడి రైలు ప్రారంభానికి కృషి చేయాలని వారు అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: