దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు కోహ్లీ వచ్చేస్తున్నాడు


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు కు విరాట్ కోహ్లీ రానున్నారు. ఇది క్రికెట్ అభిమానులకు అనందం కలిగించే వార్త అని చెప్పవచ్చు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు సిద్ధమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన కోహ్లీ ఇప్పుడు కోలుకున్నాడు. గత రెండ్రోజులుగా జట్టుతో పాటు సాధన చేస్తున్నాడు. ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాను పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నానని వెల్లడించాడు. అయితే కండరాల నొప్పితో బాధపడుతున్న సిరాజ్ రేపటి మ్యాచ్ లో ఆడేది కష్టమేనని తెలిపాడు. సిరాజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని, మూడో టెస్టుకు సిద్ధంగా ఉన్నాడని తాము భావించడంలేదని స్పష్టం చేశాడు. పూర్తి ఫిట్ నెస్ లేని ఆటగాడిని బరిలో దింపే సాహసం చేయరాదని, స్వల్ప ఇబ్బంది కాస్తా తీవ్ర గాయంగా మారే ప్రమాదం ఉంటుందని కోహ్లీ వివరించాడు. సిరాజ్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదని, హెడ్ కోచ్, వైస్ కెప్టెన్ లతో కూర్చుని దీనిపై చర్చిస్తామని తెలిపాడు. రిజర్వ్ బెంచ్ బలంగా ఉండడంతో ఎవరిని ఎంపిక చేయాలన్నది కొంచెం కష్టమైన విషయమేనని చెప్పుకొచ్చాడు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: