డ్రోన్ సహాయంతో అబుదాభిపై ఉగ్రదాడి


అధునాతన సాంకేతికతను అద్దిపుచ్చుకొంటున్న ఉగ్రవాదులు వాటి సహాయంతో దాడులను మమ్మురం చేస్తున్నారు. తాజాగా యూఏఈ రాజధాని అబుదాభి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి జరిగింది. డ్రోన్ సహాయంతో టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఎయిర్ పోర్టులోని ఇంధన వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ దాడిలో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయాయని అధికారులు తెలిపారు. మరోపక్క, ఈ డ్రోన్ దాడులు తమ పనేనని హౌతీ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. హౌతీ ఉగ్రవాదులకు ఇరాన్ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్ లో సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై హౌతీ ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో గల్ఫ్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: