సిక్స్ ప్యాక్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రామ్

హీరో రామ్ సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. రామ్ మరోసారి మాస్ యాక్షన్ హీరోగా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. అందుకోసం ఆయన మరోసారి సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. టాలీవుడ్ లో రామ్ కి చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉంది. యూత్ లో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో మాస్ లుక్ తో దర్శనం ఇచ్చాడు. ఆ సినిమా కోసం ఆయన సిక్స్ ప్యాక్ తో కనిపించి, ఫైట్స్ పరంగా .. డాన్సుల పరంగా రచ్చ చేసేశాడు. దాంతో ఆయనకి మాస్ ఆడియన్స్ నుంచి మంచి మద్దతు లభించింది. ఇక ఇప్పుడు తాను 'ది వారియర్' సినిమాను చేస్తున్నాడు. లింగుసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన మాస్ యాటిట్యూడ్ కలిగిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలోని పాత్ర కోసం రామ్ కండలు పెంచినట్టుగా చెబుతున్నారు. మరో సారి తెరపై ఆయన సిక్స్ ప్యాక్ ను చూపించనున్నాడని అంటున్నారు. రామ్ ఇంతవరకూ తన కెరియర్లో పోలీస్ పాత్ర చేయలేదు .. ఇదే ఫస్టు టైమ్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా కృతి శెట్టి అలరించనుంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: