ఓ నేత ప్రేమ కోసం పడరాని పాట్లా ఎందుకు రఘురామ


వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి...ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ మధ్య విమర్శల జడివాన కురస్తునే ఉంది. వైసీపీ అసంతృప్త ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఢిల్లీ నుంచి మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓ నేత ప్రేమ కోసం ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నార‌ని ఆయ‌న అన్నారు. 'ఎవరి మొప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా! నలభై ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్ల‌కు  ప్రేమ బాణాలు వేస్తుంటే అతని ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబితే వాళ్లే రాళ్లతో కొడతారు' అంటూ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: