ఇంట గెలిచి రచ్చ గెలవండి దొరా: కేసీఆర్ కు షర్మిళ హితవు


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

 ఇంట గెలిచి రచ్చ గెలవండి దొరా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైసీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, కేరళ సీఎంతో మంతనాలు చేయడానికి, బీహార్ ప్రతిపక్ష నేత కలిసి దోస్తానా చేయడానికి, దేశ రాయకీయాల మీద చర్చ చేయడానికి మీకు సమయం ఉంది తప్ప చనిపోతున్న రైతులను ఆదుకోవాలనే సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలవండి దొరా అని అన్నారు. మీ రైతు వారోత్సవాల సాక్షిగా బ్యాంకుల ఆగడాలకు రైతులు బలైపోతున్నది మీకు కనపడుతోందా దొరా? అని ప్రశ్నించారు. పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకునే  రైతులు, వడ్డీ వ్యాపారుల చేతుల్లో నష్టపోయిన రైతులు మీకు కనపడరని విమర్శించారు. ముందు ఇక్కడి రైతుల చావులను ఆపి ఆ తర్వాత దేశాన్ని ఏలండి దొరా అని అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: