మంత్రి హరీష్ రావును కలిసిన నందమూరి బాలకృష్ణ
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
తెలంగాణ రాష్ట్ మంత్రి హరీష్ రావును హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. అయితే దీని వెనక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతలేదండయ్. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ కలిశారు. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చించినట్టు బాలకృష్ణ వెల్లడించారు. ముఖ్యంగా, తమ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను మంత్రికి వివరించినట్టు తెలిపారు. ఆసుపత్రికి అభివృద్ధికి సంబంధించి అనేక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని విజ్ఞప్తి చేశానని తెలిపారు. మంత్రి హరీశ్ రావు ఎంతో సానుకూలంగా స్పందించారని బాలకృష్ణ వెల్లడించారు. ఈ సమావేశంలో తనతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సీఈఓ డాక్టర్ ఆర్వీ ప్రభాకర్ రావు కూడా పాల్గొన్నారని బాలకృష్ణ పేర్కొన్నారు.
Home
Unlabelled
మంత్రి హరీష్ రావును కలిసిన నందమూరి బాలకృష్ణ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: