గడివేముల తహసిల్దారు కార్యాలయంలో .. 

ఏసీబీ దాడులు....... నగదు స్వాధీనం

(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజవర్గం,గడివేముల ఎమ్మార్వో ఆఫీస్ నందు కర్నూలు జిల్లా ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే గడివేముల మండల కేంద్రమైన స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు మధ్యాహ్నం 12:35  నుండి రాత్రి10:00 గంటల వరకు కర్నూలు జిల్లా ఏసీబీ అధికారి ఇంతియాజ్ బాషా మరియు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

43,980 రూపాయలను స్వాధీనం చేసుకున్న కర్నూలు ఏసిబీ డి ఎస్ పి శివ నారాయణ స్వామి.

ఎమ్మార్వో కార్యాలయం పై మండల పరిధిలోని ప్రజల వద్ద నుండి, రైతుల వద్ద నుండీ ఫిర్యాదులు,అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదుదారులు తెలిపారని, వాటిలో నిజా నిజాలు తెలుసుకునేందుకు విచారణ చేయడానికి వచ్చామని ఆయన తెలిపారు. గడివేముల తహాసిల్దార్ కార్యాలయంలో కర్నూలు జిల్లా ఏసీబీ అధికారులు ఇంతియాజ్ భాష మరియు సిబ్బంది చేసిన  దాడుల్లో డిప్యూటీ తహసీల్దార్ ( DT ),  విఆర్వో వివిధ గ్రామాలలోని వీఆర్వోలు దగ్గర కొంత నగదు మొత్తం దొరికాయని


వారివ వద్దనున్న డబ్బులకు వారు ఎటువంటి సంజాయిషీ కానీ, సమాధానం కానీ ఇవ్వలేదని అందువల్ల ఆ డబ్బును మేము స్వాధీనపరుచుకున్న మని, రైతులకు పంపిణీ చేయవలసిన 33 పాసు పుస్తకాలు ఆఫీసులో ఉన్నాయని, రికార్డు కూడా సరిగా లేనందు వల్ల వాటన్నింటిని స్వాధీనపరుచుకున్నామని ఏసీబీ అధికారులు తెలియజేశారు, స్వాధీనం చేసుకున్న 49,980 రూపాయలను ప్రభుత్వానికి అందజేస్తామని కర్నూలు జిల్లా ఏసీబీ అధికారి ఇంతియాజ్  బాషా తెలిపారు.
విచారణ నిర్వహిస్తున్న ఏసీబీీ అధికారులు

సోదాలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్నన ఏసీపీ అధికారి ఇంతియాజ్ బాషా


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: