అతిచిన్న వయస్సులో అద్భుతమైన రికార్డ్


సాహసం కొందరికి ఇష్టంగా మారుతుంది. అలాంటి సాహసమే ఓ చిన్న వయస్సు మహిళా చేసింది. ఏకంగా రికార్డ్ తిరగరాసింది. ఐదు నెలల పాటు విమానంలో ఒంటరిగా వేల కిలోమీటర్ల ప్రయాణించి.. ప్రపంచంలోని ఐదు ఖండాలను చుట్టేసింది బెల్జియంకి చెందిన 19 ఏళ్ల జారా రూథర్‌ఫర్డ్. అతిచిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకుని చిన్న విమానంలో చుట్టొచ్చింది. గతేడాది ఆగస్టు 18న బెల్జియం నుంచి జరా రూథర్‌ఫర్డ్ ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టింది. మూడు నెలల్లోనే ప్రయాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా కొన్ని అవాంతరాలతో ఐదు నెలలు పట్టింది. 155 రోజుల అనంతరం జనవరి 20న తిరిగి స్వదేశానికి క్షేమంగా చేరుకుంది. చిన్నతనం నుంచే పైలట్‌ కావాలన్నదే జారా రూథర్‌‌ఫర్డ్‌ కల. ఆమె తల్లిదండ్రులు కూడా పైలట్‌లు కావడంతో ఆ కల సాకారం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆరేళ్లకే చిన్న చిన్న విమానాల్లో ప్రయాణించడం మొదలుపెట్టి.. 14 ఏళ్లకే సొంతంగా విమానం నడపడంలో నైపుణ్యం సాధించింది. ఈ క్రమంలోనే ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టి రావాలని నిర్ణయించుకుని, 2021 ఆగస్టు 18న శ్రీకారం చుట్టింది. మూడు నెలల్లో పూర్తికావాల్సిన యాత్ర.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వీసా ఇబ్బందుల వల్ల రెండు నెలల ఆలస్యమయ్యింది. గురువారం స్వదేశంలోకి అడుగు పెట్టిన ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బెల్జియం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నాలుగు విమానాలు ఎస్కార్టుగా వచ్చాయి. ఐదు ఖండాల్లోని 41 దేశాలను సందర్శించిన జరా.. మొత్తం 52 వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: