భారత్‌లో టెస్లా వ్యాపార కార్యకలాపాలకు ధన్యవాదా:కేటీఆర్

ముందుగా భారత్‌లో టెస్లా వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తున్నందుకు మస్క్‌కు ధన్యవాదాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్ చేసిన ఓ ట్వీట్ కొన్ని రోజులుగా వైర‌ల్ అవుతోంది. భార‌త ప్రభుత్వంతో ఎదురువుతోన్న సవాళ్ల కారణంగానే ఇండియాలోకి టెస్లా రాక ఆలస్యమవుతోందని ఆయ‌న విమ‌ర్శించారు. దీనిపై ప‌లువురు ఇప్ప‌టికే మండిప‌డుతూ ట్వీట్లు చేశారు. తాజాగా,  తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ కూడా ఈ ట్వీట్ పై స్పందించారు. ఎలాన్ మ‌స్క్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.


ముందుగా భారత్‌లో టెస్లా వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తున్నందుకు మస్క్‌కు ధన్యవాదాలని కేటీఆర్ పేర్కొన్నారు. భార‌త్‌/తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయన్నని ఆయ‌న చెప్పారు. ప్ర‌ధానంగా పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ‌ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని చెప్పారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: