పుష్ప మైండ్ బ్లోయింగ్ మూవీ:జాన్వీ కపూర్
(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)
పుష్ప సినిమాను ఉద్దేశించి 'ప్రపంచంలోనే అత్యంత కూల్ మేన్' అని మైండ్ బ్లోయింగ్ మూవీ అని బాలివుడ్ అగ్రతార జాన్వీ కపూర్ ప్రశంసించింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో విడుదలైన 'పుష్ప' సినిమా ఘన విజయం సాధించింది. బన్నీ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది. బాలీవుడ్ లో సైతం హిందీ సినిమాలతో పోటీ పడి ఈ సినిమా వసూళ్లను సాధించింది. బాక్సాఫీస్ వద్ద మోత మోగించిన ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలయింది. దీంతో, థియేటర్లలో ఈ సినిమాను చూడలేని సెలబ్రిటీలు ప్రస్తుతం ఓటీటీలో చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాను చూసిన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అద్భుతంగా ఉందని కితాబునిచ్చింది. 'పుష్ప' ఫొటోను షేర్ చేస్తూ 'ప్రపంచంలోనే అత్యంత కూల్ మేన్' అని వ్యాఖ్యానించింది. మైండ్ బ్లోయింగ్ మూవీ అని కొనియాడింది.
Home
Unlabelled
పుష్ప మైండ్ బ్లోయింగ్ మూవీ:జాన్వీ కపూర్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: