ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పై ఎత్తులు
(జానో జాగో వెబ్ న్యూస్- నెట్ వర్క్ డెస్క్)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందుకోసం ప్రత్యర్థులపై పై ఎత్తులు వేస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లిని యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. 125 మందితో ఇవాళ వెల్లడించిన తొలి జాబితాలో ఆమె పేరునూ ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఆశాసింగ్ ను ఎన్నికల బరిలో దించుతున్నామని ఆమె చెప్పారు. ఇక, ఆమెతో పాటు గోండు గిరిజనుల కోసం సోన్ భద్రలోని ఉంభా గ్రామంలో ఉన్న భూ సమస్యపై న్యాయపోరాటం చేస్తున్న రామ్ రాజ్ గోండ్ కూ టికెట్ ఇచ్చినట్టు తెలిపారు. గత ఏడాది నవంబర్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసేందుకు వచ్చి, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న ఆశా వర్కర్ పూనమ్ పాండేకీ టికెట్ ఇచ్చామని పేర్కొన్నారు. సీఏఏ వ్యతిరేక అల్లర్లలో జైలుపాలైన కాంగ్రెస్ నేత సదాఫ్ జాఫర్ కూ టికెట్ ఇచ్చినట్టు చెప్పారు. తొలి జాబితాలో 50 మంది (40%) మహిళలకు చోటిచ్చారు. మొత్తంగా ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల్లో 40 శాతం యువతే కావడం విశేషం. కాగా, ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లికి టికెట్ ఇవ్వడం పట్ల రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ చేతిలో ఎవరి బిడ్డైతే అన్యాయానికి గురైందో.. ఆమె ఇప్పుడూ న్యాయానికి ప్రతినిధిలా నిలబడతారని ట్వీట్ చేశారు. ‘పోరాడుతాం.. గెలుస్తాం’ అని పేర్కొన్నారు.
Home
Unlabelled
ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పై ఎత్తులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: