బూస్టర్ డోస్ పై అపోహలొద్దు

స్వయంగా వేయించుకొని...భరోసానిచ్చిన గడివేముల పోలీస్ సిబ్బంది

 బూస్టర్ డోస్ వేయించుకున్..... పోలీస్ సిబ్బంది

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

బూస్టర్ డోస్ పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, బూస్టర్ డోస్ వేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని ప్రజలకు గడివేముల  పోలీస్ శాఖ పిలుపునిచ్చింది. కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలం లో బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది బూస్టర్ డోస్ వ్యాక్సిన్ను వేయించుకున్నారు. తద్వారా ఈ బూస్టర్ డోస్ పై ఎలాంటి అపోహలొద్దని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గడివేముల పోలీస్ విధులు నిర్వహిస్తున్న వారు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో 50 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేయించుకోని కరోనా బారినపడకుండా ఆరోగ్యంగా ఉండాలని, మండలంలోని ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరించి,


స్వీయ రక్షణ పాటిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పిల్లల ను బయటకు రావాలని, బహిరంగ ప్రదేశాలలో గుంపులు గుంపులుగా తిరిగ రాదని, గడివేముల మండలం లోని 50 సంవత్సరములు పూర్తయిన ప్రజలందరూ బూస్టర్ డోసు వేయించుకొని వేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని వారు తెలిపారు.

బూస్టర్ డోస్ వేయించు కుంటున్న పోలీస్ సిబ్బంది 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: