అదే దూకుడు...ఈ రోజు అదే జోరు పెంచిన మార్కెట్


(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

కరోనా ప్రభావం ఏ మాత్రం షేర్ మార్కెట్ పై చూపడం లేదు. రోజు రోజుకు షేర్ మార్కెట్ తన దూకుడును ప్రదర్శిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నేడు కూడా లాభాల్లో కొనసాగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 533 పాయింట్లు లాభపడి 61,150కి పెరిగింది. నిఫ్టీ 157 పాయింట్లు పుంజుకుని 18,212 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:

మహీంద్రా అండ్ మహీంద్రా (4.68%), భారతి ఎయిర్ టెల్ (3.76%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.58%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.68%).

టాప్ లూజర్స్:

టీసీఎస్ (-1.50%), టైటాన్ (-1.46%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.58%), టెక్ మహీంద్రా (-0.55%), విప్రో (-0.40%).

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: