రుణ గ్రస్తులకు కేంద్రం మరో బంపర్ ఆఫర్

రుణ గ్రస్తులకు కేంద్రం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ తాజాగా రుణ గ్రహీతలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేసింది. లోన్ మారటోరియంకు లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఆర్థిక సంస్థలు) సమర్పించిన బ్యాలెన్స్ క్లెయిమ్స్‌ చెల్లింపునకు అంగీకారం తెలిపింది. దీనిక కోసం రూ.973 కోట్లుకు ఆమోదం తెలిపింది 1.3.2020 నుంచి 31.8.2020 మధ్య కాలానికి సంబంధించిన లోన్ అకౌంట్లకు చెందిన ఎక్స్‌ గ్రేషియా స్కీమ్ కింద కాంపౌండ్ వడ్డీకి, సింపుల్ వడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని కేంద్రం ఇప్పుడు చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో లోన్ మారటోరియం ప్రయోజనాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లోన్ మారటోరియం సమయంలోని వడ్డీ డబ్బులను వెనక్కి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన నిబంధనలను కూడా జారీ చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులను పూర్తిగా చెల్లించింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: