నోటీ ద్వారా కూడా డయాబెటీఎస్ ను గుర్తించవచ్చు


మధుమేహ వ్యాధి ప్రమాదమే కాదు వాటిని గుర్తించలేకపోవడం వల్ల కూడా లేని కష్టాలు వస్తున్నాయి. కాబట్టి మధుమేహ వ్యాధిని ఇలా గుర్తించవచ్చు అని వైద్యులు పేర్కొంటున్నారు. నోటీ వాసన ద్వారా, ఇతర వాటి ద్వారా కూడా మధుమేహ బరినపడ్డ విషయాన్ని గుర్తించవచ్చన్నారు. జీవనశైలి మార్పుతో మధుమేహం రిస్క్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. దీని కారణంగా శరీరంలో ఎన్నో అవయవాలపై ప్రభావం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కారణమయ్యే ఆరోగ్య సమస్యల్లో మధుమేహం కూడా ఒకటి. కరోనా వైరస్ ప్రభావం మధుమేహ బాధితుల్లో ఎక్కువగానే ఉంటోందని గణాంకాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. కనుక మధుమేహం ఉందా? లేదా.. ఉంటే నియంత్రణలో ఉందా? అన్నది ముఖ్యంగా చూసుకోవాలి. అప్పుడే వైద్యులను సంప్రదించడం, వారి సూచనల మేరకు సంరక్షణ చర్యలకు అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే న్యూరోపతి, కిడ్నీల్లో రాళ్లు, హార్ట్ స్ట్రోక్, అంధత్వం వంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటే, నోటి చుట్టూ కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయని మయో క్లినిక్ సైతం చెబుతోంది. ‘‘మధుమేహం  శరీరంలోని అన్ని అవయవాలతో ముడిపడి ఉంటుంది. నోరు కూడా ఇందుకు మినహాయింపు కాదు. మధుమేహం అంటే కిడ్నీలు, నెర్వ్ లు గురించి మాట్లాడుతుంటారు. నోటి గురించి ఎవరూ ప్రస్తావించారు. కానీ, మధుమేహం వచ్చిన వారిలో తరచూ నోటి ఇన్ఫెక్షన్లు సాధారణంగా మారతాయి. పళ్లు, చిగుళ్లు, నోటి ఇన్ఫెక్షన్ లను గుర్తించొచ్చు’’అని గురుగ్రామ్ కు చెందిన ఆర్టెమిస్ హాస్పిటల్ చీఫ్ ఎండోక్రైనాలజిస్ట్ ధీరజ్ కుమార్ తెలిపారు. ‘‘నోటి నుంచి దుర్వాసన వస్తుందేమో చూసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఎక్కువగా ఉంటుంటే పళ్లల్లో పుచ్చులు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇక మధుమేహం కారణంగా కీటోన్ స్థాయులు పెరిగిపోతే అప్పుడు డయాబెటిక్ కెటోఅసిడోసిస్ కు దారితీస్తుంది. దీనివల్ల నోటి దుర్వాసన వస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ 250/300 ఉండే వారిలో ఈ పరిస్థితి చూడొచ్చు. అందుకే యూరిన్ లో కీటోన్లు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి’’ అని ధీరజ్ కుమార్ తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: