పాఠశాలలకు సెలవులు పొడగించాలి

జానో జాగో సంఘం డిమాండ్

జానో జాగో (ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్, జాతీయ కార్యదర్శి మహబూబ్ భాషా

(జానో జాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

రోజురోజుకు కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి జానో జాగో (ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్, జాతీయ కార్యదర్శి మహబూబ్ భాషా డిమాండ్ చేశారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాలేదు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈసారి కరోనా కేసుల్లో ఎక్కువగా బాధితులు అవుతున్నది చిన్నపిల్లలని పలువురు శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులను పొడిగించడం శ్రేయస్కరమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ దిశగా చర్యలు తీసుకున్నాయి అని ఆయన పేర్కొన్నారు. చిన్న పిల్లల ప్రాణాలను పణంగా పెట్టే లా పాఠశాలలను తెరవడం సబబు కాదేమో అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం పునరాలోచన చేసి విద్యా సంస్థల సెలవులను పొడగించాలని ఆయన కోరారు. యువతే దేశానికి పెద్ద మానవ వనరు అని వారు పేర్కొన్నారు. నేటి విద్యార్థులే మన దేశానికి రేపటి పెద్ద మానవ వనరు అని వారు పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: