కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్శిటీలో కులం కేటగిరి చిచ్చు


ప్రతిష్టాత్మక కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్శిటీలో ఇపుడు కులం కేటగిరి చిచ్చుమొందలైంది. దీనిపై అనుకూల, వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్శిటీ జాబితాలో కొత్తగా కులం అనే కేటగిరీ వచ్చి చేరింది. ఈ సరికొత్త విధానం పట్ల మిశ్రమ స్పందన ఎదురవుతోంది. రైట్ వింగ్ స్టూడెంట్స్ యూనియన్లు దీన్ని సమర్థిస్తోన్నాయి. కులం ఆధారంగా విద్యార్థులపై చూపుతున్న వివక్షతకు బ్రేక్ పడుతుందని అంటున్నాయి. అదే సమయంలో- కులం అనే కేటగిరిని తీసుకుని రావడం పట్ల టీచింగ్ స్టాఫ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది.  కులం అనే కేటగిరీని చేర్చాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ 80 మందికి పైగా టీచింగ్ స్టాఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనివర్శిటీ ట్రస్టీలకు లేఖ రాసింది. కుల-మతాలకు అతీతంగా విద్యాబోధన నిర్వహించాల్సిన చోట ఈ కేటగిరీని యూనివర్శిటీ అధికారులు తీసుకుని రావాలని నిర్ణయించడం సరైన నిర్ణయం కాదని స్ఫష్టం చేస్తోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, అనాలోచింగా తీసుకున్న నిర్ణయంగా చెబుతోంది. ఎవ్వరినీ సంప్రదించకుండానే అధికారులు క్యాస్ట్ కేటగిరీని తీసుకొచ్చారని భగ్గుమంటోంది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. కులపరమైన వివక్ష లేదా అణచివేతకు గురైన విద్యార్థులు- తమకు జరిగిన అవమానాన్ని యూనివర్శిటీ అధికారులకు దృష్టికి తీసుకెళ్లడానికి ఈ విధానం వల్ల వీలు ఉంటుంది. యూనివర్శిటీ ఉన్నతాధికారులకు దీనిపై ఫిర్యాదు చేయొచ్చు. భారత్ సామాజిక కులవ్యవస్థలో నిమ్న వర్గాలకు చెందిన ప్రజలు అట్టడుగున ఉంటారని ఈక్విటీ ల్యాబ్స్‌ తెలిపింది. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కాలిఫోర్నియా అతి పెద్దది.

 ఆ దేశవ్యాప్తంగా 23 క్యాంపస్‌లు, ఎనిమిది ఆఫ్ లైన్ క్యాంపస్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీలో చదువుకునే విద్యార్థుల సంఖ్య 4,85,550. 55,909 మంది ఫ్యాకల్టీలు, ఇతర స్టాఫ్‌లు ఉన్నారు. వారిలో మెజారిటీ అధ్యాపకులు ఈ క్యాస్ట్ కేటగిరీని వ్యతిరేకిస్తోన్నారు. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు లేఖ రాశారు. కులాన్ని నిర్దుష్ఠంగా, ఓ ప్రత్యేక రక్షిత కేటగిరీగా చేర్చడం భారత్, దక్షిణాసియా సంతతికి చెందిన అధ్యాపకులకు మాత్రమే వర్తిస్తుందని, వారిని ప్రోత్సహించేలా ఉందనే వాదనలు కూడా ఉన్నాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: