కనుమ పండుగ సందర్భంగా..

 పైబోగుల లో కబడ్డీ పోటీలు

కబడ్డి ఆటల పోటీలను ప్రారంభిస్తున్న నిర్వాహకులు 

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలం పరిధిలోని పైబోగుల గ్రామంలో టిడిపి సర్పంచ్ గంజర్ల గంగాధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కబడ్డీ క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కబడి క్రీడ ఒక గ్రామీణ క్రీడ అని కబడ్డీ ఆట ఆడడం వల్ల యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని,

కనుమ పండగ సందర్భంగా ...కబడ్డి ఆడుతున్న క్రీడాకారులు 


యువకులు,శారీరక, మానసిక, ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారని, క్రీడల్లో గెలుపోటములు సహజ సిద్ధమని,ఓటమి చెందిన క్రీడాకారులు నిరాశ పడకుండా క్రీడాకారులు ఆడేటప్పుడు ఎక్కడ ఆటలో తప్పు చేశామని తెలుసుకొని మరో ఆట లో విజయం సాధించేందుకు ప్రయత్నం చేయాలని, కబడ్డీ ఆట లోని నైపుణ్యం మెరుగుపరుచుకుని విజయం సాధించేందుకు

జట్టు సభ్యులు కృషి చేయాలని ఆయన తెలిపారు. కబడ్డీ ఆటలో పాల్గొనేందుకు వివిధ గ్రామాల నుండి 10 టీములు రాగా అందులో మొదటి బహుమతి 10,016/- రూపాయలనుపై పైబోగుల గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారులకు గంజర్ల గంగాధర్ రెడ్డి బహుమతి ప్రధానం చేశారు. రెండవ బహుమతి 5,016/- రూపాయలను ఒందుట్ల గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారులకు గంజర్ల గణేష్ రెడ్డి గారు బహుమతి ప్రధానం చేశారు.వివిధ గ్రామాల నుండి కబడ్డీ ఆట ఆడడానికి వచ్చిన క్రీడాకారులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించినందుకు క్రీడాకారులు పైబోగుల కబడ్డీ క్రీడా కమిటీకి,గ్రామ ప్రజలకు ,కృతజ్ఞతలు తెలిపారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: