పంజాబ్ ఎన్నికల బరిలో సోనుసూద్ సోదరి...కాంగ్రెస్ లో చేరిక


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలో చేరికలు ఊపందుకొన్నాయి. తాజాప్రముఖ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక సచార్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాళవిక రాజకీయ రంగప్రవేశంపై కొన్నాళ్లుగా వార్తలు వస్తుండడం తెలిసిందే. మాళవిక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తమ స్వస్థలం మోగా నుంచే ఆమె బరిలో దిగే అవకాశాలున్నాయి. ఇవాళ మోగాలో జరిగిన ఓ కార్యక్రమంలో పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మోగాలో సోనూ సూద్ నివాసానికి వచ్చారు. సోనూ సూద్, మాళవికతో ఆయన చర్చలు జరిపారు. ఇదిలావుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల సోనూ సూద్ ను పంజాబ్ ఐకాన్ గా తొలగించడం తెలిసిందే. సోనూ సూద్ సోదరి రాజకీయాల్లోకి వస్తుండడంతో ఎస్ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే బాధ్యతను గతంలో సోనూ సూద్ కు అప్పగించింది. పంజాబ్ ఐకాన్ గా నియమించింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: