ప్యాడ్స్ కు బదులు మెన్ స్ట్రువల్ కప్స్


(జానో జాగో వెబ్ న్యూస్- నెట్ వర్క్ డెస్క్)

ఆ గ్రామంలో మహిళలకు నెలసరి సమయంలో ప్యాడ్స్ కు బదులు మెన్ స్ట్రువల్ కప్స్ అందించడంతో ఆ గ్రామం శానిటరీ న్యాప్కిన్స్ రహిత గ్రామంగా పేరుగాంచింది. నెలసరి సమయాల్లో మహిళలు శానిటరీ న్యాప్కిన్స్ వాడడం సహజం. అయితే కేరళలోని ఓ గ్రామం దేశంలోన ‘తొలి శానిటరీ న్యాప్కిన్స్ రహిత గ్రామం’గా రికార్డులకెక్కనుంది. ఎర్నాకుళంలోని కుంబలంగిలో ప్యాడ్స్ కు బదులు మెన్ స్ట్రువల్ కప్స్ ను అందించనున్నారు. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ఇవాళ 5 వేల మెన్ స్ట్రువల్ కప్పులను పంపిణీ చేయనున్నారు.


‘అవల్కాయ్ (ఆమె కోసం)’ అనే పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఎంపీ హీబి ఈడెన్ చెప్పారు. థింగాల్ స్కీమ్ కింద హెచ్ఎల్ఎల్ మేనేజ్ మెంట్ అకాడమీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నాయన్నారు. కప్పుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుంబలంగిని మోడల్ విలేజ్ గా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రకటించనున్నారు. ప్రధానమంత్రి సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్ఏజీవై) పథకం కింద ఈ మోడల్ గ్రామ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: