తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు


తనపై కొందరు పనిగట్టుకొని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తన ఎలెక్షన్ అఫిడవిట్ పై అనవసరంగా రచ్చ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి కలిసి ఆడుతున్న నాటకం ఇదని చెప్పారు. వీరెవరనే విషయాన్ని ఆధారాలతో సహా బయటపెడతానని అన్నారు. ఓటరు జాబితా నుంచి తన ఓటు తీయించే పని కూడా గతంలో వీరు చేశారని ఆరోపించారు. బీఫామ్ తో పాటు ఇచ్చిన అఫిడవిట్టే ఫైనల్ అవుతుందని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. తాను నామినేషన్ వేసినప్పటి నుంచి కొందరు వ్యక్తులు తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. తన అఫిడవిట్ పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారని.. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు దాన్ని డిస్మిస్ చేసిందని చెప్పారు. 2021లో ఈ  పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు ముగించిందని తెలిపారు. ఇతర వ్యక్తులు వేసిన పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్నాయని చెప్పారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: