ఈ' కార్ రేసింగ్ కు భాగ్యనగరం ఆతిథ్యం


అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఫార్ములా ఈ' కార్ రేసింగ్ కు భాగ్యనగరం ఆతిథ్యమివ్వబోతోంది. దీంతో ఇప్పటికే ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్న హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఫార్ములా ఈ' కార్ రేసింగ్ కు భాగ్యనగరం ఆతిథ్యమివ్వబోతోంది. ఈ రేసింగ్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి, ఫార్ములా ఈ సంస్థకు, గ్రీన్ కో అనే సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగనుంది. ఈ రేసింగ్ ను ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డీ ఆటోమొబైల్ అనే సంస్థ ప్రతి ఏడాది ఒక్కో నగరంలో నిర్వహిస్తుంటుంది. ఈ రేసింగ్ జరగబోతున్న నేపథ్యంలో లండన్, న్యూయార్క్, రోమ్, సియోల్ వంటి నగరాల సరసన హైదరాబాద్ చేరబోతోంది. ఇతర రేసింగ్ లకు ఈ కార్ రేసింగ్ లకు తేడా ఉంది. ఇతర రేసింగ్ లను ప్రత్యేకంగా నిర్మించిన రేస్ ట్రాక్ లలో నిర్వహిస్తారు. ఈ రేసింగ్ కు పత్యేక ట్రాక్ అవసరం లేదు. నగరంలో రోడ్లు సాఫీగా ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు సరిగ్గా ఉండాలి. మరోవైపు మన దేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలను కాదని ఈ రేసింగ్ హైదరాబాదుకు రానుండటం గమనార్హం. మరోవైపు ఈ ఒప్పందంలో భాగంగా రేస్ నిర్వహించే ప్రాంతాల్లో రోడ్లను విస్తరించాల్సి ఉంటుంది. అంతేకాదు, ప్రేక్షకుల కోసం అక్కడక్కడ స్టాండ్స్ ను ఏర్పాటు చేయాలి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: