అత్యధిక దేశాల్లో మన కోవిషీల్డ్ టీకాను వాడుతున్నారాంటా


అత్యధిక దేశాల్లో ప్రజలకు ఎక్కువగా వినియోగిస్తున్న టీకాల్లో మొదటిది కోవిషీల్డ్ (అక్కడ వేరే పేరుతో) వాడుతున్నారటా. ఈ టీకా మన దేశానికి చెందిన కంపెనీది. కరోనాపై పోరాటంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు టీకాలను  యుద్దప్రాతిపదికన అభివృద్ధి చేసి తీసుకొచ్చాయి. సుమారు 12 వరకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. భారత్ లో ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ (సిరమ్ ఇనిస్టిట్యూట్ తయారీ, మార్కెటింగ్), భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్ చాలా ముందుగా అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత రష్యా తయారీ స్పుత్నిక్ వి, క్యాడిలా తయారు చేసిన జైకోవ్ డి, బయోలాజికల్ ఈ కార్బె వ్యాక్స్ అందుబాటులోకి వచ్చాయి.


ఇవి కాకుండా ప్రపంచవ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్, మొడెర్నా, నోవావాక్స్, సనోఫి టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అత్యధిక దేశాల్లో ప్రజలకు ఎక్కువగా వినియోగిస్తున్న టీకాల్లో మొదటిది కోవిషీల్డ్ (అక్కడ వేరే పేరుతో). 178 దేశాల్లో ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ టీకాను ఇస్తున్నారు. ఫైజర్, బయో ఎన్ టెక్ అభివృద్ధి చేసిన టీకాను 145 దేశాల్లో, సీనో ఫార్మ్ టీకాను 88 దేశాల్లో వినియోగిస్తున్నారు. మొడెర్నా టీకాను 80 దేశాల్లో, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాను 79 దేశాల్లో, స్పుత్నిక్ వి టీకాను 48 దేశాల్లో, సినోవాక్ టీకాను 44 దేశాల్లో, కొవాగ్జిన్ టీకాను 9 దేశాల్లో ఇస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: