రంగ రంగ వైభవంగా...

వైకుంఠ ఏకాదశిమి పూజలు


(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండల పరిధిలోని వైష్ణవ ఆలయాలలో భక్తులు రంగ రంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో  పూజలు నిర్వహించారు.వి వరాల్లోకి వెళితే...... వైకుంఠ ఏకాదశిమి సందర్భంగా గడివేముల లో వెలిసిన శ్రీ చెన్నకేశవస్వామి, బూజు నూరు, కొరటమద్ది గ్రామాలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో తెల్లవారుజాము 04:00 గంటల నుండి  స్వామి వారికి గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా గడివేముల గ్రామం లో వెలిసిన శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయానికి, గడివేముల గ్రామానికి చెందిన L.లక్ష్మి రెడ్డి, శ్రీమతి L.శివమ్మ గార్ల కుమారుడు L.పెద్ద వెంకట రెడ్డి, శ్రీమతి L.చందన వారి కుటుంబ సభ్యులు సుమారు 12 వేల రూపాయల విలువ గల 16 తులాల వెండి శఠగోపం ను శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయానికి బహూకరించారని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ మూర్తి గారు తెలిపారు. 


 

JSW సిమెంట్ ఫ్యాక్టరీ వారి దత్తత గ్రామాలైన బిలకలగూడూరు, బూజు నూరు, గ్రామాల మధ్య వెలిసిన బాలాజీ ఆలయంలో భక్తులు తెల్లవారు జామున 05:00 గంటల నుండి ఉత్తర ద్వారా దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరారు. JSW సిమెంట్ యాజమాన్యం వారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాలాజీ ఆలయానికి వివిధ రకాలైన పూలమాలలతో ఆలయం ను రంగ రంగ వైభవంగా అలంకరించారు

 అందుబాటులో ఉంచిన ఆంబులెన్స్, ప్రథమ చికిత్స వైద్యులు

దర్శనానికి వచ్చే భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సామాజిక దూరం పాటిస్తూ, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భక్తులు స్వీయ రక్షణ పాటిస్తూ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వారికి ప్రధమ చికిత్స


నిర్వహించేందుకు డాక్టర్లను అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచారు,ద్విచక్ర వాహనాలపై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక వాహన పార్కింగ్ ను ఏర్పాటు చేశారు భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తమ గ్రామంలోని పిల్లలు మరియు కుటుంబ సభ్యులు కరోనా మహమ్మారి బారిన పడకుండా కాపాడి, ఆయురారోగ్యాలతో, క్షేమంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: