డాబర్‌ హనీ అంబాసిడర్‌గా రష్మిక మందన్న


(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

డాబర్‌  ఇండియా లిమిటెడ్‌ నేడు తాము సుప్రసిద్ధ దక్షిణాది నటి రష్మిక మండన్నను తమ నూతన బ్రాండ్‌ అంబాసిడర్‌గా తమ డాబర్‌ హనీ బ్రాండ్‌ కోసం ఎంచుకున్నట్లు వెల్లడించింది. రష్మిక కీలక పాత్రలో తీర్చిదిద్దిన పలు ప్రచార చిత్రాలను విభిన్నమైన మాధ్యమాల ద్వారా ప్రసారం చేయనున్నారు. ఈ భాగస్వామ్యం, దక్షిణ భారత మార్కెట్‌లలో డాబర్‌ హనీ స్థానాన్ని స్థిరీకరించనుంది.

డాబర్‌ ఇండియా లిమిటెడ్‌ మార్కెటింగ్‌ హెడ్‌ – హెల్త్‌ సప్లిమెంట్స్‌ శ్రీ ప్రశాంత్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ  ‘‘కుమారి రష్మిక మందన్న ఇప్పుడు డాబర్‌ హనీ నూతన ప్రచారకర్తగా నిలువడం పట్ల ఆనందంగా ఉన్నాం. ఆమె డాబర్‌ హనీ బ్రాండ్‌ విలువలను ప్రతిబింబించడానికి ఖచ్చితమైన వ్యక్తిగా నిలుస్తారు.అదే సమయంలో ఆరోగ్యం, ఆరోగ్యవంతమైన జీవనశైలి దగ్గరకు వచ్చేసరికి యువతతో నేరుగా అనుసంధానించబడగలరు. ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్‌కు ప్రతిరూపం ఆమె. యువతకు ఆరాధ్యమైన నటిగా మేము లక్ష్యంగా చేసుకున్న వినియోగదారులను తక్షణమే చేరుకోగలమని ఆశిస్తున్నాము’’అని అన్నారు.

24 కెరట్ల బంగారంలా స్వచ్ఛమైనది డాబర్‌ హనీ అంటూ ప్రత్యేక ప్రచారాన్ని డాబర్‌ హనీ ప్రారంభించింది. రష్మిక దీనిలో కనిపించనున్నారు. 

‘‘ఇది పూర్తి వినోదాత్మక ప్రచారం. మన రోజు వారీ డైట్‌లో తేనె ఇప్పుడు అంతర్భాగంగా మారింది. ఇది కేవలం మన  ఒక్కరికి మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి  ఆరోగ్యం, పోషకాలను అందిస్తుంది. ఈ చిత్రం ద్వారా దానిని పునరుద్ఘాటిస్తున్నాం’’ అని అగర్వాల్‌ అన్నారు.

రష్మిక మాట్లాడుతూ ‘‘డాబర్‌ హనీతో ఈ ప్రయాణం ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాను. ఆరోగ్యవంతమైన జీవనం వల్ల కలిగే ప్రయోజనాలను తెలపడం పట్ల సంతోషంగా ఉన్నాను.ఈ ప్రచారం ద్వారా నా అభిమానులు తమ రోజువారీ జీవితంలో తేనెను భాగంగా చేసుకోగలరని అనుకుంటున్నాను. ప్రస్తుత సమయంలో, మనమంతా మన ఆరోగ్యంపై దృష్టి సారించాల్సి ఉంది. ఈ నూతన ప్రచారంతో, మన జీవితాలలో డాబర్‌ హనీ  ప్రాముఖ్యతను వెల్లడించనున్నాను’’ అని అన్నారు.

డాబర్‌ ఇండియా లిమిటెడ్‌ రీజనల్‌ బిజినెస్‌ హెడ్‌–సౌత్‌ జె పి విక్టోరియా మాట్లాడుతూ ‘‘ఎన్నో సంవత్సరాలుగా మా వారసత్వ ఉత్పత్తిగా డాబర్‌ హనీ వెలుగొందుతుంది.  దక్షిణ భారతదేశంలో యువ తారతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. డాబర్‌ హనీ వ్యక్తిత్వంను రష్మిక ప్రదర్శించనున్నారు’’ అని  అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: