నాకు కరోనా...కలిసేందుకు రావద్దు(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

తనకు కరోనా సోకిందని, తనను కలిసేందు ఎవరూ రావద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ కోరారు. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ అనే విషయం తెలియగానే ఆయన హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని మంత్రి సూచించారు అలాగే, తనను కలుసుకోవడానికి ఇంటి వద్దకు ఎవరూ రావద్దని మంత్రి కోరారు.


అవసరమైతే ఫోన్ ద్వారా సంప్రదించాలని చెప్పారు. మరోవైపు వారం క్రితమే ఆయన రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అవంతి శ్రీనివాస్ కరోనా బారిన పడటం ఇది రెండోసారి. ఫస్ట్ వేస్ సమయంలో కూడా ఆయనకు కరోనా సోకింది. ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. కొడాలి నాని, వంగవీటి రాధా తదితర నేతలకు ఇటీవలే కరోనా సోకింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: