బర్త్ డే సెలబ్రేషన్స్ పేదల సేవలో,,,నలుగురికి ఆదర్శంగా 

వైసీపీ మైనార్టీ నేత సయ్యద్ మొహిద్దీన్ అడుగులు

(జానో జాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

బంధువులు....స్నేహితుల రాకతో విందు.. వినోధాలతో ఎవరైనా తన జన్మదినాన్ని జరుపుకోవాలని అనుకొంటారు ఎవరైనా. కానీ అందుకు భిన్నంగా,,, నలుగురికి ఆదర్శంగా నిలిచేలా కొందరు మాత్రమే వినూత్నంగా ఆలోచిస్తారు.అలాంటి వారిలో మార్కాపురం పట్టణానికి చెందిన వైసీపీ మైనార్టీ నాయకులు సయ్యద్ మొహిద్దీన్ ఒకరు. తన జన్మదినాన్ని పేదల సేవలో ఆయన జరుపుకొన్నారు. మార్కాపురం పట్టణంలో పలు చోట్ల చలికి వణుకుతూ రోడ్లపై ...దుప్పట్లు లెకొండా పడుకొనే వారికి సయ్యద్ మొహిద్దీన్ దుప్పట్లు పంపిణీ చేశారు. ఇక పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.


పేదల సేవలో తన జన్మదినాన్ని జరుపుకోవడం తనకు ఎంతో ఇష్టమని మొహిద్దీన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉన్నవారితో జన్మదిన వేడుకలు జరుపుకొనే కంటే లేని వారి కష్టాలు తీర్చడంలోనే తనకు అసలైన ఆనందం కనిపించిందని మొహిద్దీన్ పేర్కొన్నారు. ఇదే పరంపరను కొనసాగించే ప్రయత్నం తాను చేస్తానని ఆయన వెల్లడించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: