తెలుగు ప్రజలకు  పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు 

(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

తెలుగు ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు  తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు భోగి సందర్భంగా సోషల్ మీడియాలో తన సందేశం పంచుకున్నారు. భారతీయ పండుగలన్నీ ప్రకృతి, పర్యావరణ ఆధారిత సంబరాలేనని వెల్లడించారు.


ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసుకుని రైతు మురిసిపోయే వేడుకే మన సంక్రాంతి పండుగ అని వివరించారు. ప్రకృతిపరంగా చూస్తే సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే తరుణంలో వచ్చే ఈ పండుగను మకర సంక్రాంతిగా జరుపుకుంటామని తెలిపారు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న సౌభాగ్యవంతంగా విలసిల్లాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి తెలుగు వారందరికీ మంచి ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను అందించాలని కోరుకుంటున్నానని, భారతీయులందరికీ తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నానని వివరించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: