ఏకంగా 40 లక్షలు పలికిన సర్పంచ్ పదవి

ఎన్నికలు తెలుగు రాష్ట్రంలోనే చాలా ఖరీదు అని ఇంతవరకు మనం భావించాం. ఒడిశా పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తొలి దశ నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగానే పలుచోట్లు సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించడం గమనార్హం. బొలంగీరు జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ పదవిని వేలంవేయగా ఓ వ్యక్తి రూ.44 లక్షలకు దక్కించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం జరిగిన ఈ ఘటనపై నిజానిజాల నిగ్గు తేల్చాలని జిల్లా కలెక్టరుకు రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశించారు. బొలంగీరు జిల్లా పుంయింతొల మండలం బిలెయిసొర్డా పంచాయతీలో బిలెయిసొర్డా, బొందొనొకొటా, కొస్రుపల్లి గ్రామాలు ఉన్నాయి. మొత్తం 15 వార్డులు ఉన్న ఈ పంచాయతీ సర్పంచ్‌ స్థానం జనరల్ అభ్యర్థికి రిజర్వ్ అయ్యింది. దీంతో గ్రామాభివృద్ధికి సర్పంచ్‌‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే సంకల్పంతో జనవరి 16న గ్రామసభ ఏర్పాటు చేశారు. స్థానిక జగన్నాథ మందిరం ఆవరణలో జరిగిన ఈ సమావేశానికి మూడు గ్రామాల ప్రజలు, ఔత్సాహిక అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం వేలం పాటను మొదలుపెట్టారు.

పలువురు ఔత్సాహిక అభ్యర్థులు వేలంలో పాల్గొనగా, సుశాంత ఛత్రియా అనే వ్యక్తి అధిక మొత్తంతో సర్పంచ్‌ పదవిని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఆయన మాత్రమే సర్పంచ్‌ అభ్యర్థని, ఎవ్వరూ పోటీగా నామినేషన్లు వేయకూడదనే షరతు పెట్టారు. దీంతో సుశాంత ఛత్రియానే బిలెయిసొర్డా పంచాయతీ సర్పంచ్‌ అని స్థానికంగా వినిపిస్తోంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: